ఎన్నికల ప్రచార సభలో వైకాపా అధ్యక్షుడు :జగన్ హామీలు

రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలందరి కష్టాలు విన్నాను, చూశాను, నేనున్నానని అందరికీ భరోసా ఇస్తున్న అని వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.

ఆయన సోమవారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో రోడ్ షో ,అనంతపురం జిల్లా రాయదుర్గం, కడప జిల్లా రాయచోటి లో బహిరంగ సభలో మాట్లాడారు.

నాలుగైదు రోజుల్లో వైకాపా మ్యానిఫెస్టో ఎన్నికల ప్రణాళిక వెల్లడిస్తామని ప్రకటించారు,

ఎన్నికల్లో గెలిచేందుకు ఏ అన్యాయం మోసం చేయడానికైనా వెనుకాడని మనస్తత్వం చంద్రబాబుదని మండిపడ్డారు

ప్రజల ఆధార్ వివరాలు డేటా చోరీ చేస్తారని అన్నారు. బ్యాంక్ ఖాతా నెంబర్లు ,

చివరికి మన ఇంట్లోని ఆడవాళ్ళ ఫోన్ నెంబర్లు సైతం జన్మభూమి కమిటీ సభ్యులకు సేవామిత్రులకు ఇచ్చే సంస్కారం లేని పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు చివరకు హత్యలు చేయడానికి వెనకాడటం లేదు ,

వైకాపాకు కడప అండగా ఉందని పార్టీని దెబ్బ తీయడానికి ఏకంగా మా చిన్నాన్న చంపించడానికి సిద్ధపడ్డారు.

చిన్న నాను పోగొట్టుకున్నది మేము హత్య చేసింది వాలు, విచారణ చేసేది వాళ్ళ పోలీసులే, ఇది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం అని జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రానికి చంద్రబాబు అడ్డగోలుగా దోచేస్తున్నారని దొంగే దొంగ దొంగ అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉందని జగన్ ధ్వజమెత్తారు.

వచ్చే 20 రోజుల్లో కట్టు కథలు, సినిమాలు చూపిస్తారు అన్నారు ,ఓటుకు మూడు వేలు చొప్పున ప్రతి ఒక్కరి చేతిలో పెట్టి ఆలోచన చేస్తారని గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారని వివరించారు.

మూడు వేలకు మోసపోవద్దని 20 రోజులు ఓపిక పడితే మన అన్న సీఎం అవుతాడని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి, విశ్వసనీయతకు ,వంచనకు మధ్య యుద్ధం చంద్రబాబు ఐదేళ్లలో అన్ని మోసాలు చేసి అసత్యాలు చెప్పారు.

జగన్ ఆరోపించారు.హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి అంగీకరించడం ద్వారా మరో మోసం చేశారని ఆరోపించారు ,23 మంది ఎమ్మెల్యేలు అవినీతి సొమ్ముతో కొనారని విమర్శించారు.

కేంద్రం పోలవరం కొడతానన్న కమీషన్ల కోసం లాక్కున్నారని ఇసుక మట్టి నుంచి రాజధాని భూములు వరకు దేన్నీ వదలకుండా దోచుకున్నారని విమర్శించారు.

పిల్లల ఉన్నత చదువులకు వారి తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు.

రాష్ట్రంలో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలను మూసేసి కార్పొరేట్లకు మేలు చేస్తున్నారని జగన్ విమర్శించారు.

సగటు కుటుంబం ఏమి కోరుకుంటుందని వోదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు సమాధానం కోసం వెతికాను అని జగన్ తెలిపారు.

ఒక ప్రభుత్వానికి మనసుంటే ఇంటింటికి మేలు చేయవచ్చు అన్నారు.రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు,

వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రతి అవ్వా ప్రతి తాతకు పింఛను మూడు వేలకు పెంచుతూ పోతోంది అని అన్నారు.

నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశం అందరికీ చేరాలని అప్పుడు చంద్రబాబు మోసాన్ని గట్టిగా ఆపగలుగుతాం అని పిలుపునిచ్చారు ,

ఒక్కసారి అవకాశం ఇస్తే నాన్న లాంటి గొప్ప పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. నేనున్నానని భరోసా ఇస్తున్న అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *