సిగ్గుతో తలదించుకుంటున్నానని.. తనను క్షమించాలని..కోరిన వైసీపీ ఎంపీ రఘురామ.. కారణం ఇదే..


తన సొంతూరిలోనే ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రావడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్గుతో తలదించుకుంటున్నానని.. తనను క్షమించాలని ఎంపీ కోరారు.

క్షమాపణలు కోరిన వైసీపీ ఎంపీ రఘురామ.. కారణం ఇదే..నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ… అధికార పార్టీ నేతలకు టెన్షన్ పెడుతున్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు క్షమాపణలు చెప్పారు.

అయితే ఆయన సారీ చెప్పింది ఏ రాజకీయ పార్టీకో.. నేతలకో కాదు. తన సొంతూరి ప్రజలకు ఎంపీ రఘురామ క్షమాపణలు కోరారు. సీఎం జగన్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన అంబులెన్సులు .. అవసరానికి మాత్రం ఉపయోగపడటం లేదన్నారు.

తన సొంతూళ్లలో కరోనా బాధితుడ్ని చెత్త వేసే మున్సిపాలిటీ బండలో ఆస్పత్రికి తీసుకెళ్లడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

తన సొంత ఊర్టో చోటు చేసుకున్న ఈఘటనతో సిగ్గుతో తల దించుకుంటున్నానని … ప్రజలు తనను క్షమించాలని అన్నారు.

వెయ్యికి పైగా అంబులెన్సులు ఏర్పాటు చేసినా.. అవి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి మీడియా తీసుకెళ్లాలని కోరారు ఎంపీ రఘురామ.

కరోనా కేసుల్లో దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుందని… రానున్న రోజుల్లో అగ్రస్థానానికి చేరుకుంటుందని తెలిపారు.

యాంటీ బాడీ టెస్టులు ఆలస్యమవుతున్నాయని… టెస్ట్ ఫలితాలు ఏడు రోజుల తర్వాత వస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అతి పెద్ద సమస్య కరోనానే అని చెప్పారు.

రాష్ట్రంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని… సాక్షాత్తు ఎంపీలు కూడా కరోనా బారిన పడ్డారని అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

ఆ ఊరి బస్టాప్ లో రెండు రోజుల నుంచి అనారోగ్యంతో ఓ వ్యక్తి భాధపడుతున్నాడు. అయితే కరోనా వైరస్ భయంతో ఎవరూ అతని దగ్గరికి కూడా వెళ్ళలేదు.

108 కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేట్ అంబులెన్సులకు కూడా ఫోన్ చేసారు.

కానీ వారు కుడా స్పందించలేదు. ఇక చివరికి చెత్త బండిలో ఆకివీడు ప్రభుత్వాసుపత్రికి ఆ వ్యక్తిని తరలించారు.

ఈ ఘటనపైనే వైసీపీ ఎంపీ రతన ఘురామ స్పందిస్తూ.. తన సొంతూరి ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *