యూఎస్ఏలో యాత్ర ప్రభంజనం

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ యాత్ర.

వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
దాదాపు రెండున్న దశాబ్దల తరువాత మళయాల మెగాస్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలాఎన్నో విశేషాలు లతో తెరకెక్కిన యాత్ర ఎలా సాగింది.?

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర ఈరోజు విడుదలయింది. విడుదల అయిన అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.

ఇండియా లో నిన్న రిలీజ్ అవగా యూఎస్ఏ లో నిన్న రాత్రి ప్రీమియర్ షోలు వేశారు.
ఓవర్సీస్ లో 180 స్క్రీన్లలో రిలీజైంది. థియేటర్ల వద్ద కోలాహాలం నెలకొంది. అన్ని ఏరియాల నుండి యాత్రకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

ఎన్నారైలు, వైఎస్సార్ అభిమానులు యాత్ర సినిమాను చూసి మహి వి రాఘవ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుంటున్నారు.

ఒక మంచి భావోద్వేగ కథను చక్కగా చూపించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మమ్ముట్టి, వైఎస్సార్ పాత్రలో ఒదిగిపోయారని, వైఎస్సార్ ని మళ్ళీ చూసిన అనుభూతి కలిగిందని అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

యూకే, దుబాయ్, ఆస్ట్రేలియా అన్ని ప్రాంతాల్లో యాత్రకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అన్ని లొకేషన్స్ లో థియేటర్స్ హౌస్ ఫుల్ తో నడుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *