దేవుని ప్రజల ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో నేనే సీఎం అంటున్న జగన్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

తిరుపతి సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్లపాటు హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా బిజెపి చెప్పిందన్నారు.

గురువారం కడప మున్సిపల్ మైదానంలో బూత్ కమిటీ సభ్యులు కన్వీనర్లతో జరిగిన సమర శంఖారావం సభలో జగన్ మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధిపతి పవన్ పై విమర్శలు గుప్పించారు . పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ, టీడీపీ ల తో కలిసి ఊరూరా తిరిగారు ,నాలుగేళ్లు కలిసి పనిచేశారు.

హోదా తెచ్చే బాధ్యత నాది చెప్పారు. చంద్రబాబు చేయకపోయినా అన్ని పనులు తాము చేస్తామని పవన్ మోసం చేశారు.

అందుకే ఎవరిని నమ్మవద్దు. వైసిపి 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటే మనమే హోదా తెచ్చుకుంటాం.

రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదు మరో నెలల్లో ఎన్నికలు వస్తాయి. వైసీపీని గెలిపించే బాధ్యత మీ భుజాలపై పెడుతున్నాను.

అన్న వస్తున్నాడు అని అక్కకు ,చెల్లికి ,అమ్మకు, అన్నకు, తాతకు, చెప్పండి.

దేవుని ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో నేను సీఎం అవుతానని ,ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. అవ్వకు ,తాతకు ఇచ్చే రెండు వేల పెన్షన్ ను మూడు వేలకు తీసిన పోతానని అన్నారు.

పేదలకు ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

ప్రత్యేక హోదా పేరిట చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, నల్ల చోక్కలు వేసుకుంటే హోదా రాదు అని జగన్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు భయంతో ఏవేవో హామీలు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో సర్వే పేరుతో వైసిపి ఓట్లను తొలగిస్తున్నారు, ఎన్నికల కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు.

దోచిన డబ్బును బిస్కెట్ల ప్రజలకు పంచుతారని, ప్రలోభాలకు లొంగవద్దు ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *