YS Jagan గారూ.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారా లేదా’ అంటూ ప్రశ్నించిన నారా లోకేష్…

YS Jagan గారూ.. సీఎం పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు’ ‘టీడీపీ హయాంలో లేని పేపర్ లీకేజ్‌ని తెరపైకి తెచ్చి రభస చేశారు. అప్పుడు రాజీనామా చేయాలి, విచారణ జరపాలి అన్నారు. మీరు రాజీనామా చేస్తున్నారా లేదా’ అంటూ ప్రశ్నించిన నారా లోకేష్.

1.ఏపీలో పేపర్ లీక్ ప్రకంపనలు
2.జగన్ సర్కార్‌పై టీడీపీ ఫైర్
3.సీఎం రాజీనామా చేయాలన్న లోకేష్

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం రేపింది. ఏపీపీఎస్సీలో ఉద్యోగులు పేపర్ లీక్ చేశారనే ఆరోపణలు రావడంతో..

ప్రతిపక్షం టీడీపీ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది. కష్టపడి పరీక్షలు రాసిన నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడుతోంది.

తాజాగా వైఎస్సార్‌సీపీ సర్కార్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ టీడీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శల్ని ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని ప్రశ్నించారు.

‘అయ్యా జగన్ గారూ, జరగని పేపర్ లీకేజి మీద నానా రభసచేశారు అప్పట్లో గుర్తుందా? జరిగిన విచారణలో కూడా అదే తేలింది అప్పట్లో. కానీ మీరేం అన్నారో, మీ అబద్ధపు పత్రిక ఎలా విషం చిమ్మిందో ఒకసారి మళ్ళీచూసుకోండి. అప్పట్లో రాజీనామా చెయ్యాలి, సిబిఐ విచారణ చెయ్యాలి అన్నారు. ఇప్పుడు ఏమి చేద్దాం?’అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.

‘గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలను మీ మంత్రులే లీక్ చేశారు. మీ అనుచరుల కుటుంబసభ్యులకు ర్యాంకులు వచ్చాయి అన్నది వాస్తవం. 5 లక్షలకు ఒక్కో ఉద్యోగం అమ్ముకోవడం వాస్తవం.పేపర్ లీక్ స్కామ్ బయటకి రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారు.

మరి మీరు రాజీనామా చేస్తున్నారా లేదా? మేము కొత్తగా ఏమి అడగడం లేదు, అప్పట్లో మీరు అడిగిన డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నాం’అంటూ చురకలంటించారు మాజీ మంత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *