పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ మీద అభ్యర్థిని పోటీ వద్దనే ఉద్దేశంతోనే అభ్యర్థిని నిలబెట్టలేదా?

మంగళగిరిలో లోకేష్‌పై అభ్యర్థిని నిలబెట్టకపోవడానికి కారణమిదేనా!

పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ మీద అభ్యర్థిని పోటీ వద్దనే ఉద్దేశంతోనే అభ్యర్థిని నిలబెట్టలేదా?

ఇక్కడి నుంచి సీపీఐ అభ్యర్థిని రంగంలోకి దింపడానికి కారణమేంటి? మంగళగిరి చరిత్ర ఏం చెబుతోంది?

1.పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ మీద అభ్యర్థిని పోటీ వద్దనే ఉద్దేశంతోనే అభ్యర్థిని నిలబెట్టలేదా?

2.ఇక్కడి నుంచి సీపీఐ అభ్యర్థిని రంగంలోకి దింపడానికి కారణమేంటి?

3.మంగళగిరి చరిత్ర ఏం చెబుతోంది?

ఏపీ ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జనసేన బరిలో దిగుతోంది.

బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కేటాయించిన పవన్.. సీపీఐ,

సీపీఎంలకు తలో ఏడు అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాల చొప్పున కేటాయించారు.

మిగతా స్థానాల్లో జనసేన బరిలో దిగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నప్పటికీ..

నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళరి స్థానాన్ని సీపీఐకి కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.

లోకేష్‌పై తన పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపొద్దనే ఉద్దేశంతో పవన్ ప్యాకేజీ తీసుకొని ఆ స్థానాన్ని సీపీఐకి ఇచ్చారని వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.

వివిధ వర్గాలకు చెందిన వారిలోనూ ఈ విషయమై చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించారని ఆ నియోజకవర్గ చరిత్రను బట్టి చెప్పొచ్చు.

1952 నుంచి మంగళగిరి నుంచి గెలుపొందిన పార్టీలను పరిశీలిస్తే..

నాలుగుసార్లు కమ్యూనిస్టులు, ఆరుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు టీడీపీ, ఒకసారి జనతాపార్టీ గెలిచాయి.

2014లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై విజయం సాధించారు.

గత ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది.

టీడీపీ గెలిచిన రెండు పర్యాయాలు కూడా 1983, 1985లో కావడం విశేషం.

ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా వామపక్షాలకి కేటాయించింది.

చివరగా 1994లో ఇక్కడి నుంచి సీపీఎం అభ్యర్థిగా గెలుపొందిన నిమ్మగడ్డ రామ్మోహన్ రావు..

1999లో కాంగ్రెస్ అభ్యర్థి మురుగుడు హనుమంతరావు చేతిలో ఓడారు.

2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి మహాకూటమిగా బరిలో దిగాయి.

మంగళగిరి స్థానాన్ని టీడీపీ లెఫ్ట్ పార్టీలకు వదిలేసింది. కానీ ఆ రెండు పార్టీలు అంతర్గత కలహాలతో.. చెరో అభ్యర్థిని బరిలో నిలిపాయి.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కాండ్రు కమల విజయం సాధించారు. ఆమెకు 52,585 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో ఇది 32.50 శాతం.

ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి తమ్మిశెట్టి జానకీ దేవి 39,823 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇది 24.61 శాతం.

సీపీఎం అభ్యర్థి దొంతిరెడ్డి శ్రీనివాస కుమారికి 25,525 ఓట్లు పడ్డాయి. ఇది 15.77 శాతం.

ప్రస్తుతం మంగళరి నుంచి బరిలో దిగుతోన్న ముప్పాళ్ల నాగేశ్వర రావుకు.. 2009లో 12,762 ఓట్లొచ్చాయి.

ఇది 15.54 శాతం. ఉభయ కమ్యూనిస్టులు ఒక్క అభ్యర్థినే బరిలో దింపితే..

కాంగ్రెస్‌కు గట్టిపోటీనిచ్చేవారని దీన్ని బట్టే అర్థమవుతోంది.

అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వంతో పోరాడుతున్నారు. త్రిముఖ పోరులో ఆయన గట్టిపోటీనిచ్చే అవకాశమే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *