మూడు ప్రాంతాల్లో ఎం అభివృద్ధి చేశావ్? ఏడాదిగా ఎం పీకావ్..ఈసారి ఏకంగా సీఎం జగన్‌పై డైరెక్ట్ అటాక్ చేసిన నారా లోకేష్!!

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌కు ఫేక్ ట్వీట్ల బెడద తప్పడం లేదు.

వరుసగా ఫేక్ ట్వీట్ల దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

తాజాగా మరోసారి లోకేష్‌తో పాటు ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సైతం ఫేక్ ట్వీట్ల అనుభవం ఎదురైంది.

దీంతో మార్ఫింగ్ ట్వీట్లతో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై లోకేష్ విరుచుకుపడ్డారు.

ఈసారి సీఎం జగన్‌, వైసీపీ కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయారు. ఈ మేరకు మంగళవారం లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.

‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పీటీఎం బ్యాచ్ 5 రూపాయిల ముష్టి కోసం నికృష్టపు పనులు చేస్తూ బరితెగిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఫేక్ ట్వీట్లతో ఆవేశపడుతున్నారు. ఈ ఫేక్ బతుకులకు స్వస్తి పలికి, వారు మొదలుపెట్టిన మూడు ముక్కలాట తో సాధించింది ఏంటి? మూడు ప్రాంతాల్లో ఎం అభివృద్ధి చేశావ్? ఏడాదిగా ఎం పీకావ్ అని ”యుశ్రారైకాపా” అధినేత జగన్ రెడ్డి ని నిలదీస్తే మంచిది’’ అంటూ లోకేష్ చురకలంటించారు.
కాగా, అధికార వైసీపీలో పార్టీ పేరు విషయంలో పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజే ఈ వివాదానికి ఆద్యంపోశారు. ఆయనకు విజయసాయిరెడ్డి క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు గాను నోటీసు ఇవ్వగా.. తమ పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ కాదని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.

అప్పటి నుంచి లోకేష్ వైసీపీ అని పిలవడం మానేసి.. ‘యుశ్రారైకాపా’ అని సంబోధిస్తున్నారు.

అలాగే తనపై ఫేక్ ట్వీట్లు చేస్తున్న వారిని వైకాపా పేటీఎం బ్యాచ్ అంటూ ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *