ఏపీ ప్రజలను ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు

  • 1.అమాయకులు, వెర్రి వాళ్లు, అర్బకులు.. ఏపీ ప్రజలు!
  • 2.తను ఏ చెబితే దాన్నే వెర్రి గొర్రెల్లా వింటూరు.
  • 3.అందుకు అసెంబ్లీలో తీర్మానమే సాక్ష్యం.

‘ఏపీకి ద్రోహం చేసిన వాళ్లతో జగన్ అంటకాగుతూ ఉన్నాడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ స్విచ్ తెలంగాణలో ఉంది, ఫ్యూజ్ ఢిల్లీలో ఉంది.. కేసీఆర్, మోడీలతో జగన్ దోస్తీ చేస్తున్నాడు. వాళ్లు ఏపీకి ద్రోహం చేస్తున్నారు. ఏపీని సామంత రాజ్యంగా చేసుకోవాలని చూస్తున్నారు..’ఇవీ చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు అనుదినం ఇస్తున్న లీకులు.

ఈ లీకులనే రోజుకు ఒక రకంగా.. చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్లతో చెప్పడం, అవి అనుకూల మీడియాకు అట్టే వినపడిపోవడం జరుగుతోంది. ఇదే కథ ఏపీలో డైలీ సీరియల్ లా సాగుతూ ఉంది. మాటలు మారుతూ ఉంటాయి, తాత్పర్యం మాత్రం అదే!

ఈ మాటలు విన్నాకా కలిగే మొదటి సందేహం ఏమిటంటే, ఇంతకీ ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారు? అనేది! తను ఏం చెబితే దాన్నే వెర్రి గొర్రెల్లా వింటూ, తన అనుకూల మీడియాలో రోజు గోబెల్స్ ప్రచారం చేయించుకొంటూ ఉంటే…దాన్నే నమ్మేసే అమాయకులు, అర్బకులు ఏపీ ప్రజలు అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు అనేది మాత్రం స్పష్టం అవుతోంది.

ఎందుకంటే.. మొన్నటి వరకూ ఇదే మోడీతో చంద్రబాబు నాయుడు దోస్తీ చేశారు. మోడీ మళ్లీ ప్రధాని కావాలని తీర్మానం పెట్టింది కూడా ఇదే చంద్రబాబు నాయుడే. ఏపీకి మోడీ చేసిన సాయం అంతా ఇంతా కాదు.. అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిందీ ఈయనే.

అందుకు అసెంబ్లీలో తీర్మానమే సాక్ష్యం. అసెంబ్లీ రికార్డుల్లో అది కూడా భద్రంగా ఉంటుంది. మోడీని బాబుగారు ఎన్ని రకాలుగా  ప్రశంసించారో.. ఎంతలా ఆకాశానికి ఎత్తారో ఆయన సొంత మీడియాలోని పాత కథనాలు కూడా సాక్ష్యం చెబుతాయి.

ఇక కేసీఆర్ కథకు వద్దాం.. మొన్నటి వరకూ చంద్రబాబు నాయుడు ఏమన్నారు?

చంద్రబాబు నాయుడు ఏమన్నారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంరద్భంలో ఏమన్నారు? కేసీఆర్ తో పొత్తు కోసం తను తీవ్రంగా ప్రయత్నించినట్టుగా చెప్పుకోలేదా? కేసీఆర్ తో సఖ్యతగా సాగేందుకు తను ఎంతగానో ప్రయత్నించినట్టుగా చెప్పుకోలేదా? హరికృష్ణ అంతిమయాత్ర సందర్భంగా కూడా పొత్తు చర్చలు సాగించినట్టుగా చెప్పలేదా? తనే పొత్తు కోసం ప్రయత్నిస్తే కేసీఆర్ పొత్తుకు రాలేదని వాపోలేదా? 

మోడీతో స్నేహం చేసినప్పుడు, ఆయనతో అధికారం పంచుకున్నప్పుడు ఆయన ఏపీకి ద్రోహి అనిపించలేదు, కేసీఆర్ తో దోస్తీ కోసం ప్రయత్నించినప్పుడూ ఆయన కూడా ఏపీకి ద్రోహి అనిపించలేదు. ఎందుకంటే.. అవి బాబు కోరుకున్నవి. 

ఇక మోడీతో జగన్ కలవలేదు, మోడీ ప్రధాని కావాలని జగన్ అనడం లేదు, మోడీ భజనా చేయడం లేదాయన. ఇక కేసీఆర్ తో జగన్ కలవలేదు.

కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి జగన్ ప్రయత్నించలేదు. కేసీఆర్ తో పొత్తుకు రెడీ అని కూడా జగన్ అనలేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడూ జగన్ కేసీఆర్ తో దోస్తీ కోసం ప్రయత్నించలేదు.

జగన్ పై కేసీఆర్ కూ ప్రేమ కారిపోవడం లేదు. చంద్రబాబు నాయుడు అంటే ఉన్న వ్యతిరేకతతో.. కేసీఆర్ పార్టీ వాళ్లు స్పందిస్తూ ఉన్నారు. 

దీన్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు చేస్తున్న యాగీని గమనిస్తే.. బాబు రాజకీయం ఎంత నైఛ్యంగా ఉందో.. మీడియాను అడ్డం పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేస్తూ ఎంత దారుణమైన రాజకీయాన్ని ప్లే చేస్తున్నారో అర్థం చేసుకోవడం ఏపీ ప్రజలకు సులభమే.

అయితే బాబు నీఛ రాజకీయం గురించి వాళ్లు కాసేపు ఆలోచించాలంతే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *