వీకెండ్ సెలబ్రేషన్: చలో ఉదయం తెలంగాణ @ గొట్టం గుట్ట

హైదరాబాద్: ప్రకృతి అందాలను తిలకించడానికి నగరవాసులు విహార యాత్రల వెంట పడుతూ ఉండడం సహజం దీనిలో భాగంగా చాలా మంది పర్యాటకులు ఊటీ వెళ్తుండటం చాలా సహజం. కోటి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరోటి లాంటి ప్రదేశం ఉంది.

యాంత్రిక జీవనం తో సతమతమవుతున్న ప్రజానీకానికి ఆహ్లాదపరిచే ఊటీ లాంటి చోట మన తెలంగాణలో ఉండడం విశేషం. ఒక్కసారి మనం తెలంగాణ ఊటీ కి వెళ్తే చాలు మనసు కు ప్రశాంతత మరియు ఒత్తిడిని దూరం చేసుకుని మంచి అవకాశం.

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తమను తాము మై మర్చిపోతారు. హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న తెలంగాణ పోటీ గురించి ఈ వీకెండ్ స్పెషల్ స్టోరీ. ప్రకృతి అందాలను తన ఒడిలో దాచుకున్న గొట్టం గుట్ట. తన సోయగాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్న గొట్టం గుట్ట తెలంగాణ ఊటీ గా ప్రాచుర్యం పొందింది.

ఏ వైపు చూసిన పచ్చని అందాలతో కనువిందు చేస్తున్న ఈ హైదరాబాద్ ఊటీ. మనసును కట్టిపడేసే మనసుంటే తన సోయగాలు తో ఈ ప్రదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. గిరుల కురుల నుంచి జాలువారే వాగు పరవళ్లు అబ్బురపరుస్తాయి.

Zaheerabad, Gottam Gutta, Hill Adventures

ఆ ప్రాంతాన్ని చేరే దిశగా అడవి ప్రయాణం ఎన్నో మధురానుభూతులను మిగులుస్తుంది.హైదరాబాద్ నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరం ఉండే గొట్టం గుట్ట గురించి చాలా మందికి తెలియదు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ సుందర టుడే ప్రకృతి ప్రదేశం ప్రకృతి సోయగాలకు నిలయం.

గొట్టం గుట్ట చేరుకోవడానికి అడవి ద్వారా సాగే ప్రయాణం ద్వారా పొందే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మట్టి రోడ్డు ప్రయాణం, దారిపొడవునా కనిపించే పచ్చని చెట్లు ఇలా ప్రతిదీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సందర్శకులు అడవి తల్లి ఒడి చేరగానే తమకు తాము మైమరచి పోతూ ఉంటారు.

పెద్దవాళ్ల సైతం చిన్నపిల్లల గా మారి కేరింతలు కొడతారు. పర్యాటకం.. ఆధ్యాత్మికం మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం పర్యాటకులకు ఆహ్లాదం పంచడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇటు పర్యాటకం, అటు ఆధ్యాత్మికం…

రెండిటినీ కలిపి చేసుకున్న ఈ ప్రదేశం గొట్టం గుట్ట. ఎంతో విశాలమైన ఈ అటవీ ప్రదేశం కొండల మధ్యలో నుంచి ప్రవహించే పెదవాగు పురాతనమైన దేవాలయం పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. గొట్టం గుట్ట ప్రయాణంలో భాగంగా జహీరాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించ గానే అద్భుత అందాలు ఆహ్వానం పలుకుతుంటాయి.

ఎటువైపు చూసినా ఆహ్లాదపరిచే దృశ్యాలతో కళ్లను కట్టిపడేసే అందం సొంతం చేసుకుంది ఈ ప్రదేశం. మార్గ మధ్యలో చించోలి అభయారణ్యం తో చిన్న చిన్న దేవాలయాలు, శివాలయం, విఘ్నేశ్వరాలయం, భవాని మాతా మందిరాలు కనిపిస్తాయి.

భూమికి పచ్చని రంగేసినట్లు అలా అన్నీ దాటుకుంటూ ముందుకు వెళితే వంపులు తిరుగుతూ పోతుల తొక్కే నదీజలాలు ఆహ్వానం పలుకుతాయి.

ఆ దృశ్యాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. అక్కడ శ్రీ గురు గంగాధర ఒక్క ప్రభు దేవస్థానం ఉంది. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలతో పాటు జాతర కూడా నిర్వహిస్తారు. తెలంగాణ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

అటవీ వైశాల్యం ఎక్కువగా ఉండడంతో దీన్ని రెండో శ్రీశైలం గా అభివర్ణిస్తారు., ఎత్తయిన కొండలు, లోతైన లోయలు.. ఎటుచూసినా పచ్చని చెట్లు కళ్లను ఆకట్టుకుంటాయి. కొండల నుంచి జల జల పారే సెలయేరు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తూ ఉంటాయి.

భూమికి పచ్చని చీర చెప్పినట్లు ఉంటుంది ఇక్కడి ప్రకృతి సోయగం. గొట్టం గుట్ట నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జాడి మల్కాపూర్ జలపాతం కూడా కనువిందు చేస్తుంది. ప్రతి శని ఆదివారాల్లో ఇక్కడ ప్రదేశం పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఈ ప్రాంతానికి దిగు వైపున చంద్రగిరి డ్యామ్ ఉంది.

వీకెండ్ డెస్టినేషన్, వీకెండ్ టూర్ కు పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా గొట్టం గుట్ట అని చెప్పుకోవచ్చు. మన యాంత్రిక జీవనంలో టైం మిషన్ తో కుస్తీ పడుతున్నవారు ఇక్కడకు ఒక్కసారి వెళితే తమను తాము మై మర్చి పోవడం ఖాయం. అద్భుతమైన అనుభవాలతో నిలయం ఈ ప్రదేశం.

ఇక్కడి ప్రాంతం లో సినిమా షూటింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. 75 శాతం కర్ణాటక, 25 శాతం తెలంగాణ భూ భాగం ఉన్న ఈ ప్రదేశం రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో అభివృద్ధి జరగడం లేదనే వాదనలు ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం చొరవ చేసుకుంటే గనుక రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుంది అంటున్నారు స్థానికులు. గొట్టం గుట్ట వెళ్లాలనుకుంటే అక్కడ ఉండటానికి వసతి సౌకర్యం లేదు. ఒక్క రోజులోనే రిటన్ కావాల్సిన పరిస్థితి కానీ ఒక్కసారైనా చూసి తరించాల్సిన ప్రదేశం.

పాపికొండలు తదితర పర్యాటక ప్రాంతాల్లో ఉన్నట్లుగా మౌలిక వసతులు కల్పిస్తే మంచి టూరిస్ట్ పాటుగా ఈ ప్రదేశం పర్యాటకుల ఆకర్షించడంలో ఏమాత్రం సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *