మంత్రి గారి బూతు పురాణం

కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ తరుణంలో మంత్రి అచ్చం నాయుడు తన అనుచరుల వద్ద ప్రజలు అవాక్కయ్యేలా బూతు పురాణం విప్పారు.
“ఏరా ఫ్రీ గా 100 యూనిట్ల విద్యుత్తును తీసుకొని….. మీ ఆవిడ 10000 డ్వాక్రా లో దొబ్బింది…. రుణమాఫీ వస్తే దొబ్బరు….. ఇవన్నీ దొబ్బి మనకి ఓటు వేయకపోతే నిలదీయండి” అని అనుచరుల వద్ద ఎంతో అవహేళనగా మాట్లాడారు.
ప్రజల పట్ల ఎంతో గౌరవంగా మాట్లాడవలసిన మంత్రి ఈవిధంగా మాట్లాడటం తో చాలా అంతా విస్తుపోయారు.
సోమవారం శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాళి మండలం పర్యటనలో భాగంగా సొంత మైదానంలో మంత్రి గారి బూతు పురాణం విన్న వారిలో కొంతమంది నవ్వుకో గా….
మరికొంతమంది ఆయన సొంత డబ్బు ఏమైనా ఇచ్చారా? ఇలా అవహేళన చేస్తూ మాట్లాడారు అని విసుగు ప్రదర్శించారు.