గేటు బయటే పడిగాపులు విశాఖ పోలీస్ యంత్రాంగానికి తీవ్ర అవమానం కేసీఆర్ కంటే ముందే తెలంగాణ ప్రత్యేక పోలీసు వర్గం

విశాఖపట్నం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విశాఖపట్నం లోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన సందర్భంలో  స్థానిక పోలీసులు యంత్రాంగానికి తీవ్ర అవమానం జరిగింది..  కేసీఆర్ కంటే ముందే తెలంగాణ ప్రత్యేక పోలీసు బలగాలు విశాఖకు చేరుకున్నాయి.   ఆదివారం ఉదయం నుంచే శారదాపీఠాన్ని  తెలంగాణ  పోలీసులు  తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  బయట వారిని ఎవర్నీ పీఠం లోనికి అనుమతించలేదు.  చివరికి కేసీఆర్ బందోబస్తుగా  ఏర్పాటైన   ఆంధ్రా పోలీస్ అధికారులను  కూడా తెలంగాణ పోలీసులు శారదాపీఠం లోనికి  అనుమతించలేదు.

కేసీఆర్ ను శారదాపీఠం లో ని కలవడానికి పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు సామాజికుల , సంక్షేమ సంఘాలు సభ్యులు పెద్ద సంఖ్యలో శారదాపీఠనికి చేరుకున్నారు. అయితే వీరెవర్నీ తెలంగాణ పోలీసులు లోనికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ ను కలవడానికి వచ్చిన వారికి తెలంగాణ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఆంధ్ర పోలీసులు ఈ విషయంలో తామేమీ చేయలేమని చేతులెత్తేయడం అప్పుడేప్పుడో అమెరికా అధ్యక్షుడు భరత్ పర్యటన కు వచ్చనప్పుడు సీఐఏ ఢిల్లీ, కోల్కత్తా తదితర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు నేడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేక తమ వెంట తమ సొంత పోలీసులు తెచ్చుకోవడం. ఓ రకంగా ఆంధ్రులను ఆంధ్ర పోలీసులను కేసీఆర్ అవమాన పరిచినట్లేన ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *