విజయనగరానికి సమీపాన ఎక్కుపెట్టిన విల్లులా రామానారాయణ క్షేత్రం

శ్రీమద్రామాయణ మహా కావ్యం లోని కీలకమైన ఘట్టాలు ఒకదాని తరువాత మరొకటిగా కళ్ళముందు ఆవిష్కృతమయ్యే అద్భుత క్షేత్రం అది.

ఎక్కుపెట్టిన రామబాణం ఆకారంలో ఉండే కమనీయ తీర్థం.

పేరు రామనారాయణం విజయనగరం జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ క్షేత్రాన్ని. తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు.

రామ ,లక్ష్మణ ,భరత, శతృఘ్న జననం. శివ ధనుర్ భాగం. సీతారామ కళ్యాణం, అరణ్యవాసం ,సీతాపహరణం ,శ్రీరామ పట్టాభిషేకం, ఇలా రామాయణంలో అత్యంత కీలకమైన 72 గంటలు అద్భుతమైన శిల్పాలు రూపంలో కళ్ళముందు ఆవిష్కృతమయ్యే చోటు రామనారాయణం.

రామనారాయణం బోధించే గురువులను తర్వాతి తరాలకు అందించాలనే లక్ష్యంతో నారాయణం నరసింహ మూర్తి క్షేత్రం రూపకల్పన చేశారు.

మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ క్షేత్రనిర్మాణాన్ని 2006లో మొదలుపెట్టారు. 2014 మార్చి 22న వేదమంత్రాల నడుమ ప్రారంభించి ప్రజల సందర్శనార్థం తెరిచారు.

ఎన్నెన్నో ప్రత్యేకతలు

హిందూ పురాణాల్లో పేర్కొన్న పురాతన నిర్మాణాలు ఆధారంగా ఈ ప్రాంగణం రూపుదిద్దుకుంది. పైనుంచి చూస్తే ఈ క్షేత్రం విల్లు నుంచి ఎక్కుపెట్టిన బాణం ఆకారంలో కనిపిస్తుంది. ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తున హనుమంతుని విగ్రహం ఉంది.

శేషపానుపుపై పవళించె,అనoత పద్మనాభ స్వామి విగ్రహం. వినాయకుడి గుడి ,రామాలయం ఉన్నాయి. భక్తులకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. హిందూ సంప్రదాయానికి సూచికగా గొశాల కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు.

ఆసక్తి ఉన్నవారికి విలువిద్య, టీటీడీ ఆధ్వర్యంలో వేద విద్య కూడా నేర్పిస్తున్నారు. ఇప్పటి దాకా 50 లక్షల మందికి పైగా రామనారాయణం ప్రాజెక్ట్ ను సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *