వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

Vangaveeti Radha Confirmed to Leave YSRCP

Vangaveeti Radha Confirmed to Leave YSRCP

మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్ కు లేఖ పంపారు. అంతకుముందు రాదా తో వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. పార్టీని వెళ్లవద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు అయితే రాధా డిమాండ్ పై అధిష్టానం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో బొత్స బుజ్జగింపులు ఫలించలేదు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు ఇవ్వాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జగన్ నుంచి హామీ లభించలేదు. ఈ నియోజకవర్గానికి ఇప్పటికే మల్లాది విష్ణు ను పార్టీ ఇంచార్జ్ గా ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ బదులు రాధా గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయవాడ తూర్పు నుంచి కానీ మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్టానం గతంలోని సూచించింది. దీనిపై అన్న సంతృప్తి చెందలేదు ఈ నేపథ్యంలో రాధా వైకాపాను వీడుతున్నట్లు కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. అప్పుడు కూడా ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. తాజాగా ఆదివారం సాయంత్రం బొత్స సత్యనారాయణ వాడలో రాధా ఇంటికి వెళ్లి గంట పాటు చర్చలు జరిపారు. పార్టీని వీడో దని, న్యాయం చేస్తామని బుజ్జగించారు. బొత్స వెళ్ళిన కొద్దిసేపటికి రాధా ఇంటి వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. అనంతరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాధా లేక పంపించారు.

ఏ పార్టీలో చేరాలనే విషయమై తన అభిమానులతో మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తన రాజీనామా గల కారణాలను భవిష్యత్ కార్యాచరణను అప్పుడే చెబుతానని పేర్కొన్నారు. రాధా తెలుగు దేశం లో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆ పార్టీ ప్రాధా తెలుగుదేశం పార్టీలో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆ పార్టీ ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

Vangaveeti Radhakrishna (ex MLA) left YSRCP
Is he showing interest to join TDP?
If TDP hasn’t welcome him, he may join Janasena as 2nd option?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *