జగన్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని.. అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయన్నారు.
పార్టీలు మారినా, నిరసనలు , ప్రదర్శనలు చేసినా , సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసినా పోలీసులు కేసులు పెడుతూ వేధిస్తున్నారని తనకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
జగన్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. అసత్యాలతో జగన్ ప్రభుత్వం కాలం గడిపుతోందని.. ఇప్పుడు పోలీసు రాజ్యం ఏలుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థతో ఇది మంచిది కాదన్నారు.
ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా బీజేపీ రాయలసీమ జోన్ ‘జన సంవాద్ వర్చువల్ ర్యాలీ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కిషన్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ఏపీలో అహంకార, అభివృద్ధి వ్యతిరేక పాలన నడుస్తోందన్నారు కిషన్‌రెడ్డి. ఏపీలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని.. అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయన్నారు.
పార్టీలు మారినా, నిరసనలు , ప్రదర్శనలు చేసినా , సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసినా పోలీసులు కేసులు పెడుతూ వేధిస్తున్నారని తనకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
చంద్రబాబు హయాంలో అవినీతి, అసత్యాల పాలన సాగిందని.. వైఎస్సార్‌సీపీ పాలనలో అవినీతి వికేంద్రీకృతమైంది అన్నారు.
రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాలు చెలరేగుతున్నాయని.. పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా.
ఈ ప్రాజెక్టుకు డబ్బులన్నీ కేంద్రమే చెల్లిస్తోందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవులను దక్కించుకున్నా రాయలసీమ అభివృద్ధి చెందలేదని..
మాజీ సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు తీసుకుని రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు.