కడపలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏపీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

Rajnath Singh hints India retaliated strongly

Rajnath Singh hints India retaliated strongly

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు . ప్రత్యేక హోదా మంత్రం జపిస్తూ ఆయన మాకు సరైన సూచనలు సలహాలు ఇవ్వడం లేదు. దీంతో అవరోధం ఏర్పడుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కు మాట చెప్పదలచుకున్నా గతంలో మేము చెప్పినట్లు ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆ దిశగా కృషి చేస్తున్నాం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కాదు ప్రత్యేక ప్రాధాన్యం ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాను అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నందునే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని కేంద్ర సమాచార రాష్ట్ర ప్రభుత్వ ఇవ్వకపోవడం వల్ల సమస్య ఏర్పడదని పేర్కొన్నారు.

కడప లో జరిగిన రాయలసీమలోని పార్లమెంటరీ నియోజకవర్గాల బిజెపి శక్తి కేంద్రాల ఇన్చార్జి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి హిందీలో కొనసాగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దాన్ని తర్జుమా చేశారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తొలుతనందమూరి తారకరామారావు నికేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్మరించుకున్నారు.

ఆంధ్రుల పక్షాన నిలిచి కాంగ్రెస్ కుట్రలపై పోయిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఏ ప్రాంతీయ పార్టీ అయినా చివరకు భూస్థాపితం కాక తప్పదని చెప్పారు. ఇప్పటివరకు జతకట్టిన ఏ పార్టీ బతికి బట్టకట్టలేదు అని స్పష్టం చేశారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ తన కుర్చీకే భద్రత లేని చంద్రబాబు దేశాన్ని కాపాడతాం అంటున్నారు అని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్నారాయణ మాట్లాడుతూ కడప కుఉక్కు పరిశ్రమ రావడం చంద్రబాబు కు ఇష్టం లేదని, కేవలం కేంద్రంపై నిందలు వేయడం తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్బీఐ మాజీ కమిషనర్ విజయబాబు రచించిన చారిత్రిక అవసరం మళ్లీ మోడీ పుస్తకాన్ని రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *