అమరావతిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ 150 కోట్లతో టెండర్లు ఖరారు

ఏపీ రాజధాని అమరావతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి 31 తేదీన ఉదయం 9 :15 నుంచి 9:50 నిమిషాలు మధ్య భూమి పూజ చేయనున్నట్లు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని 25 ఎకరాల్లో 150కోట్లతో అద్భుతంగా నిర్మించేందుకు టెండర్లు కూడా ఖరారు చేశామన్నారు అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలం లో ఆగమశాస్త్రం ప్రకారం, భూ కర్షణం కోసం జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్, jeo పోలా భాస్కర్, సి వి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ భూమి పూజ కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా రానున్నారని తెలిపారు.
సి ఆర్ డి ఏ 25 ఎకరాలు టిటిడికి కేటాయించిందని. ఇందులో ఐదు ఎకరాల్లో శ్రీవారి ఆలయం మిగిలిన 20 ఎకరాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఆడిటోరియలు, కల్యాణ మండపాలు వంటి వాటి నిర్మాణాన్నికి ప్రణాళిక రూపొందించామన్నారు. శ్రీవారి భక్తుల కోరిక మేరకు గత ఏడాది జూలైలో కురుక్షేత్రంలో శివాలయ నిర్మాణం చేపట్టామని, జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం, మార్చి 13న హైదరాబాద్లో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. విశాఖపట్నం, భువనేశ్వర్ లో శ్రీ వారి ఆలయాలతోపాటు చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. భూమి పూజలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
భూ కర్షణం తర్వాత పది రోజులు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు. తరువాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయ ఆలయ భూమిపూజ కార్యక్రమానికి శ్రీ వారి సేవకులను, భజన మండలి సభ్యులను ఆహ్వానిస్తామని. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.