వైసీపీకి వణుకుపుడుతోంది.. కేసీఆర్ మహానాయకుడా?: చంద్రబాబు

వివేకానందరెడ్డి బాత్రూమ్‌లో పడిపోయారని చెప్పారు. ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి..
గుండెపోటైతే రక్తం ఎలా వచ్చింది.ఇంట్లో రక్తాన్ని కడిగేశారు..
పోలీసుల రాకముందే ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారు.
తప్పు చేసి మళ్లీ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
1.బీహార్ రాజకీయం ఏపీలో చేస్తామంటే కుదరదు.
2.మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్.
3.కేసీఆర్ ఏమైనా మహానాయకుడా.
రాష్ట్రంలో టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి వైసీపీకి వణుకు మొదలయ్యిందన్నారు చంద్రబాబు.
ఓటమి భయంతో రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
కోడికత్తి డ్రామా పేరుతో డ్రామాలు చేశారని.. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యను కూడా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బీహార్ రాజకీయం ఏపీలో చేస్తామంటే కుదరదు.. వాళ్ల ఆటలు ఇక్కడ సాగనివ్వమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇన్ని కుట్రలు చేస్తే..
రేపు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
‘మన రాష్ట్రంపై కొందరు కుట్రలు మొదలుపెట్టారు. కేసీఆర్ తెలంగాణ ఎన్నికల సమయంలో ఆంధ్రావాళ్లకు తెలంగాణలో ఏం పని అన్నారు.
ఇప్పుడు ఆయన్ను మహానాయకుడు అంటున్నారు.. నా దగ్గర పనిచేసిన వ్యక్తి ఇలా చేస్తే నాకెంత ఉండాలి.
మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్ జాగ్రత్త. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను తెరపైకి తెచ్చారు.
ముందు గుండెపోటుతో మరణించారని తెలిసి బాధపడ్డా, సంతాపాన్ని తెలిపా.. ముందు గుండెపోటుతో చనిపోయాడని చెప్పారు.
వివేకానందరెడ్డి పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేశాక.. తర్వాత మానవత్వం లేకుండా ప్రవర్తించారు’.
‘వివేకానందరెడ్డి బాత్రూమ్‌లో పడిపోయారని చెప్పారు. ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి.. గుండెపోటైతే రక్తం ఎలా వచ్చింది.
పోలీసులకు చెప్పకుండా శవాన్ని తీసుకెళ్లి బెడ్‌రూమ్‌లో ఎందుకు పెట్టారు. ఇంట్లో రక్తాన్ని కడిగేశారు..
పోలీసుల రాకముందే ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారు.
తప్పు చేసి మళ్లీ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. తర్వాత డొంక కదిలిస్తే కుట్ర మొత్తం బయటపడింది.
ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో హత్యని తేలింది.. మళ్లీ టీడీపీ చేయించిందని మాపై నెట్టారు.
అది ఎవరు ఇల్లు, గుండెపోటు అని ఎందుకు చెప్పారు.. బెడ్‌రూమ్‌లో రక్తం ఎందుకు కడిగారో చెప్పాలి.
చట్టాన్ని ఉల్లంఘించారు.. సాక్ష్యాలను కనపడనీయకుండా చేశారు.
రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి.. విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి అని డిమాండ్ చేశారు’.
‘మొన్నకోడి కత్తి కేసు, ఇప్పుడు వివేకానందరెడ్డి కేసుల్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
వీళ్లకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి.. కాపాడే కాపాలాదారుడు ఉన్నాడని సీబీఐ దర్యాప్తు కోరుతున్నారు.
ఈ కేసును నీరుగార్చాలని చూస్తున్నారు.. దోషుల్ని పట్టుకునే వరకు వదిలపెట్టం.. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ప్రజలకు తెలియాలి.
హత్యను గుండెపోటని చిత్రీకరించారు.. సాయంత్రానికి లేఖ పేరుతో డ్రామాలు మొదలుపెట్టారు..
ఆ లేఖలోడ్రైవర్ పేరును ప్రస్తావించారు. ఈ డ్రామాలన్నీ ఏంటి.. ఇదే పులివెందుల రాజకీయం.
కార్యకర్తలందరూ దోషుల్ని నిలదీయాలి, ప్రతిపక్షంలో ఉంటే ఇలా చేస్తే.. అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి..
రాష్ట్రాన్ని రావణాసురడి కాష్టంలా మారుస్తారు’అంటూ మండిపడ్డారు.
బాబుగారు అసలు వణుకు మీకే ఉన్నట్లుంది.రావణుని కలలో ప్రతి అడుగులో రాముడు కనిపించినట్లు మీ ప్రతి అడుగులో KCR భయం పట్టుకున్నట్లుంది.
ఎందుకండి లేచింది మోదలు పడుకునేవరకు ‘పీకే పేరుతో బీహార్ ముఠా రాష్ట్రానికి వచ్చింది..
ఫారం-7 తొమ్మిది లక్షల మంది పేర్లు తొలగించారు.
జగన్ ఓటును తొలగించినట్లు దొంగ రికార్డులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఎవర్నీ వదలేదు.. ఫారం-7 ఇచ్చిన వారంతా జైలుకు పోవాల్సిందే.
సేవా మిత్ర ద్వారా సాయం చేస్తున్న కార్యాలయంపై దాడి చేసి డేటా దొంగిలించారు. ఇక్కడే అర్థమవుతోంది.. ఆంధ్రాలో ఫ్యాన్.. హైదరాబాద్‌లో స్విచ్.. ఢిల్లీలో కరెంట్ ఉందని’ అన్నారు.