నేడు ఏలూరులో వైకాపా బీసీ గర్జన

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారo వైకాపా బీసీ గర్జన సభ నిర్వహించనుంది. ఏలూరు సమీపంలోని వట్లూరు గ్రామపరిధిలో మినీ బైపాస్ పక్కనున్న కు చెందిన ఇరవై ఐదు ఎకరాల స్థలంలో సభ నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు సభ ప్రారంభం అవుతుంది ,వైకాపా నాయకులు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, జంగా కృష్ణమూర్తి ఇతర నేతలు శనివారం సాయంత్రం సభావేదిక ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు, ఈ సభ ఉద్దేశం సభలో జగన్ ఏం ప్రకటించబోతునరనెది సూచన ప్రాయంగా వివరించారు.
రాష్ట్రంలో బలహీనవర్గాలకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పార్థసారధి పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు తీసుకునే నిర్ణయాలను సభలో జగన్ ప్రకటిస్తారన్నారు.

బీసీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసే జగన్కు అండగా నిలిచేందుకు ఆయా వర్గాలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ బీసీ అధ్యయన కమిటీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ సభలో ప్రకటించడంతో బీసీల భవిష్యత్తు మారబోతుంది అన్నారు.
వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు తగిన విధానాలను వైకాపా అధినేత ప్రకటిస్తారని తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ఈ విధంగా ఉంటాయి అన్నారు, పరిశ్రమల స్థాపన కోసం ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏపీఐఐసీ లో భూములు కేటాయిస్తున్న విధంగానే.
బీసీలకు కూడా ఇవ్వడం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహకాలు కులాలవారీగా కార్పొరేషన్ ఏర్పాటు వంటి విషయాలపై జగన్ హామీలు ప్రకటించనున్నారని తెలిసింది. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయ

బీసీ డిక్లరేషన్
బీసీలకు జగనన్న ప్రకటించిన అద్భుతమైన వరాలు. వీటితో బీసీల జీవితాలే మారిపోతాయి.
- బీసీ కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 15000 కోట్లు
- 5సంవత్సరాలలో ₹75000 కోట్లు
- తొలి అసెంబ్లీలోనే సబ్ ప్లాన్ చట్టం తీసుకొస్తాం
- బీసీ ఉప కులస్తులందరికి 139 కార్పోషన్లు ఏర్పాటు చేస్తాం.
- 45౼60 వయసున్న ప్రతి అక్కకు 5సంవత్సరానికి ₹75000 YSR చేయూత పథకం ద్వారా ఉచితంగా అందింస్తాం.
- బీసీ విద్యార్థుల చదువులకు ఎన్నిలక్షలు ఖర్చయినా భరిస్తాము. బీసీ విద్యార్థుల హాస్టల్ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి ₹20,000 ఇస్తాము.
- మీ పిల్లలను బడులకు పంపండి, ప్రతి అక్కకు ₹15000 ఇస్తాము.
- శాశ్వత పద్దతిన BC కమీషన్ ను చట్టబద్దంగా ఏర్పాటుచేస్తాం.
- బడ్జెట్ లో మూడవవంతు BC లకు ఖర్చు చేస్తుంది.
- కాంట్రాక్టు సర్వీసుల్లో ఎక్కడైనా 50% పనులు SC, ST, BC, Minority లకు వచ్చేట్లు చేస్తాం.
- చిరువ్యాపారులకు పెట్టబడులకోసం కులవృత్తి చేసుకునే ప్రతిఒక్కరికి ID card ఇచ్చి, ప్రతి ఒక్కరికి సున్నా వడ్డికే ₹10000 ఇస్తాము.
- రాజకీయ ఎదుగుదల కోసం ఏ రాజకీయ పదవుల్లోనైనా SC, ST, BC, minority లక 50% రిజర్వేషన్ ఇస్తాం. ప్రత్యేక చట్టం కూడా తీసుకువస్తాం..
- నాయీ బ్రాహ్మనునికి ప్రతి షాపుకి సంవత్సరానికి ₹10000 ఇస్తాం
- సంచార జాతులకు స్థిరనివాసం,, తగిన ఉపాది,, గురుకుల పాఠశాలలు నిర్మిస్తాం.
- మత్యకారులకు వేట నిషేదసమయంలో ₹10000 ఇస్తాం.
- మత్యకారులకు భీమా వేటసమయంలో 10 లక్షల భీమా..
- కొత్తబోట్లు కొనుగోలుకు, డీజీల్ కు సబ్సీడీ..
- చేనేత అక్కచెల్లెమ్మలకు ఇంట్లో మగ్గం వున్నవారికి నెలకు ₹2000..
- యాదవులకు గొర్రెలు మేకలు చనిపోతే ₹6000 ఇన్సూరెన్స్..
- సన్నిది గొల్లలకు వారసత్వ హక్కులు కల్పిస్తాం.
- ప్రదాన ఆలయాలలో యాదవులు నాయిబ్రాహ్మలకు ట్రస్టుబోర్డు పదవులు.
- రైతన్నలు చనిపోతే, ఆత్మహత్య చేసుకున్న కులం ఎవరైనాసరే YSR భీమా ద్వారా 7లక్షలు ఇస్తాం. బలవంతపు వసూలు చేయకుండా చట్టం తీసుకువస్తాం.
- BC అంటే బ్యాక్వార్డు క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ గా తీసుకువస్తాం.
- సహకార డైరీలకు పాలు పోస్తే లీటరుకు ₹4 సబ్సీడీ ఇస్తాం.