డబ్బులిచ్చి ట్వీట్లు పెట్టిస్తున్న టీడీపీ

CM Chandrababu to Announce MLA Candidates List for AP
ఒక అంశంలో దొరికిపోయి దాన్ని కవర్ చేసుకోవడానికి మరో స్కామ్ కు పాల్పడుతూ ఉన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ.
ఎవరు ఐడియాలు ఇస్తూ ఉన్నారో కానీఒకదాని తర్వాత మరో స్కామ్ లో తెలుగుదేశం చిక్కుకొంటూ ఉండటం విశేషం
ఇదిలేదు అనేందుకు లేనట్టుగా..అన్ని రకాల స్కామ్స్ లోనూ తెలుగుదేశం పార్టీ పేరు వినిపిస్తూ ఉండటం విశేషం.
ఇటీవలే పెద్దదుమారం రేపిన క్యాష్ ఫర్ ట్వీట్స్ స్కామ్ లోనూ తెలుగుదేశం ప్రమేయం కనిపిస్తూ ఉంది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు ఆధారాలను సైతం బయటకు తీశారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి తెలుగుదేశం పార్టీ పెయిడ్ ట్వీట్లను పెట్టిస్తున్న వైనాన్ని తెరాస పట్టేసుకుంది.
అందుకు సంబంధించి ఆధారాలను కూడా చూపుతూ.. ట్విటర్ కు, సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి.
ఈ విషయాన్ని ఆ పార్టీ నేత కేటీఆర్ ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వ డేటాను తెలంగాణ ప్రభుత్వం తస్కరించిందని అంటూ.. ఒకే ట్వీట్ ను కొన్నివందల అకౌంట్స్ నుంచి పెట్టించారని, అందులో ఏపీకి ఏమాత్రం సంబంధం లేని.. దేశంలోని ఎక్కడెకక్కడి అకౌంట్ల నుంచి ఒకే ట్వీట్ ను పెట్టించారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫాలోయర్ల సంఖ్య బాగా ఉన్న ఫేక్ అకౌంట్ల ద్వారా ఒకే ట్వీట్ ను పెట్టించింది.
హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని బగ్న o చేసే పనిచేశారని.. ఈ విషయాన్ని తాము ఊరికే వదలడం లేదనిఈ క్యాష్ ఫర్ ట్వీట్స్ స్కామ్ పై ట్విటర్ కు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన తెలిపారు.