ఈ సమ్మర్ చాలా హాట్ గురూ…

వేసవి ప్రారంభంలోనే ఆంధ్రప్రదేశ్‌కు పిడుగులాంటి వార్త అందించింది వాతావరణ శాఖ. ఈ ఏడాది రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని తాజా బులెటిన్‌లో పేర్కొంది.
ఏపీలో ఈ ఏడాది ఎండలు మండిపోనున్నాయి. సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మార్చి నుంచి మే వరకు సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.5-1.0 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సమ్మర్ బులెటిన్‌లో పేర్కొంది.
దీని ప్రభావం కోస్తాంధ్రలో ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చే వేడి గాలులు ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంది.
1971 నుంచి 2019 వరకు పరిశీలిస్తే ఎండ తీవ్రత ఏటా పెరుగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
కోస్తాలో ఫిబ్రవరి నెలలో సాధారణం కంటే ఒక డిగ్రీ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, మార్చి మొదటి వారం తర్వాత 2 డిగ్రీలకు పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రాయలసీమలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నెల రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది. వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.