ఈ తేడా ను గమనించాలి!సైకిల్ పార్టీ……

Kamma brothers suspects other caste voters

Kamma brothers suspects other caste voters

జాతీయ మీడియా వర్గాలు నెలరోజుల కిందట ఏపీలో పరిస్థితుల గురించి అధ్యయనం చేసారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఎంపీ సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తమ సర్వేలో వెల్లడిస్తే ఏపీలో సైకిల్ పార్టీ వర్గాలు ఎద్దేవా చేస్తూ ఉన్నరు.

మనసులో భయం భయంగానే ఉండినా.. ఏపీలో వైసీపీ చాలా చోట్ల ఎంపీ అభ్యర్థులే సరిగాలేరు, అలాంటిది ఆ పార్టీకి ఇరవై ఎంపీ సీట్లు ఎలా వస్తాయి? అని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రశ్నించేసింది!

టీవీ చర్చ కార్యక్రమాల్లో టీడీపీ అనుకూల మీడియా వక్తలు, యాంకర్లు ప్రశ్నలు వేయసాగారు..నెలరోజుల్ల పరిస్థితిలో వచ్చిన తేడా ఏమిటో ఆ బ్యాచ్ మొత్తానికీ ఇప్పుడు అర్థం అయ్యే ఉంటుంది.

తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే.. పది ఎంపీ సీట్లలో టిడిపి పార్టీ అభ్యర్థుల కోసం వెదుక్కొంటోంది! పాతికలో పది సీట్లకు అధికార పార్టీకి సరైన అభ్యర్థులు కనిపించడంలేదు.

మొదట ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా. అవంతి శ్రీనివాస్, రవీంధ్ర బాబు. వాళ్లు ప్రాతినిధ్యం వహించిన స్థానాలకు తెలుగుదేశం పార్టీ ఎవరిని నిలుపుతుందో ఇంకా తెలియలేదు.

నరసాపురం నుంచి రఘురామకృష్ణం రాజు పోటీ చేయగా. ఆయనేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చేసుకున్నారు.

ఇక మాగుంటను ఏకంగా రెండు ఎంపీ సీట్లకు అభ్యర్థి అనుకుంటున్నారట పాపం!

ఒంగోలు, నెల్లూరు.. ఆయనేమో వైసీపీ వైపు చూస్తూ ఉన్నారు. రేపోమాపో ఆ పని కూడా పూర్తికానుంది.

నెల్లూరు నుంచి ఎంపీగా అనుకున్న తురుపుముక్క ఆదాల అందుకు నో చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ అంటున్నారు. అయితే ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు అని సమాచారం.

అనంతపురంలో జేసీ చేతులు ఎత్తేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోతే పోటీ చేసీ ప్రయోజనం లేదని అయన అన్నారు. హిందూపురంలో నిమ్మలను తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇక ఎంపీలుగా పోటీ చేసేది లేదని మురళీ మోహన్, కొనకళ్ల నారాయణ, తోట నరసింహంలు చంద్రబాబుకు తేల్చిచెప్పారు! శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసేందుకు రామ్మోహన్ నాయుడు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి.

విశాఖ విషయంలో నువ్వుంటే నువ్వు.. అని నేతలు ఒకర్నొరు ముందుకు తోసుకుంటున్నారు. కుర్రాడైన బాలయ్య అల్లుడిని పోటీ చేయించడానికి బాబుకే ధైర్యం లేదని అంటున్నారు. ఏతావాతా ఇదీ పరిస్థితి.

ఏకంగా పది ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరనే అంశం అంతుబట్టడం లేదు.ఇక ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం, విజయవాడల శెట్టికు అభ్యర్థులను రెడీ చేసుకుంది.

మరి కొంతమంది అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేసి ప్రచారం చేసుకొమ్మని చెప్పింది. ఇదీ విషయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *