వాళ్ళ బిజీ లైఫ్ లో నిర్మాతలుగా మారిన…. స్టార్ హీరోలు

సొంత నిర్మాణం చేపట్టే ఆలోచనల్లో వున్నారు. వంద కోట్ల బిజినెస్‌ తమ చిత్రాలపై ఆధారపడిన నేపథ్యంలో ప్రతి సినిమా కూడా స్టార్‌ హీరోలకి ప్రతిష్మాతకంగా మారింది.

తమకి మార్కెట్‌ వుందని, బయ్యర్లు వస్తున్నారని నిర్మాతలు ఎంత ఆఫర్‌ వస్తే అంతకి అమ్మేస్తున్నారు.

తీరా సినిమా ఫ్లాపయితే బయ్యర్లు లబోదిబోమంటూ హీరోలకి మొర పెట్టుకుంటున్నారు. దీంతో పారితోషికంలో కొంత వెనక్కి ఇవ్వక తప్పడం లేదు.

బిజినెస్‌ని అదుపులో పెట్టడానికి ఆయా హీరోలు ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ మార్కెట్‌కి అనుగుణంగా అమ్మేయడం నిర్మాతల లక్షణం.

కానీ ఫ్లాప్‌ అయితే అందరి కంటే ఎక్కువ చెడ్డపేరు హీరోకే వస్తోంది. హీరో ఫేస్‌ చూసే బిజినెస్‌ అవుతుంది కనుక హీరోలు బాధ్యతలు తీసుకోక తప్పదు.

ఈ తలనొప్పులు అంతా దేనికని స్టార్‌ హీరోలు నిర్మాణంలో ఒక చెయ్యేసి చూస్తున్నారు.

రామ్‌ చరణ్‌ ఇప్పటికే నిర్మాతగా బిజీగా వున్నాడు. అల్లు అర్జున్‌ కూడా గీతా ఆర్ట్స్‌ కాకుండా సొంతంగా ఏఏ ఆర్ట్స్‌ లాంఛ్‌ చేస్తున్నాడని చెబుతున్నారు.

తాజాగా మహేష్‌బాబు కూడా ఎంబి ప్రొడక్షన్స్‌ని విస్తృతం చేయాలని చూస్తున్నట్టు, తాను హీరోగా నటించే సినిమాలే కాకుండా ఇతర హీరోలతో కూడా చిన్న సినిమాలు తీయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

అలాగే యువ హీరోలు నితిన్‌, నాని ఇప్పటికే నిర్మాతలయ్యారు. ఇంకా నాగశౌర్య, సందీప్‌ కిషన్‌ లాంటి వాళ్లు కూడా నిర్మాతలుగా మారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *