నాకు (రమాప్రభ)తో ఉన్న బంధానికి పేరు లేదు. అది సహజీవనం కూడా కాదు” అంటున్న శరత్ బాబు

నేను ఎవరి ఆస్తిలోనూ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. ఎవరి పేరు చెప్పుకొని ఎదగలేదు. ఎంతోమంది పేరున్న వ్యక్తులే తమ వారసుల్ని సినిమా రంగంలో నిలబెట్టుకోలేకపోయారు.
వాళ్ళ అందరి కన్నా తనేం గొప్పది కాదు… నన్ను “ఇండస్ట్రీలో నిలబెట్టడానికి” అని శరత్ బాబు అన్నారు. తన ఆస్తిని శరత్ బాబు లాక్కున్నారని ఇప్పటికే పలుమార్లు సీనియర్ నటి రమాప్రభ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
వాటికి శరత్ బాబు ఓ ఛానల్లో స్పందించారు.
ఆయన మాట్లాడుతూ “నాకెప్పుడూ స్వార్థ పూరిత ఆలోచనలు లేవు”. మాది సాంప్రదాయ కుటుంబం . సిల్వర్ స్పూన్ తో పుట్టాను. ఎవరితోనూ ఫుడ్ కోసం పరిచయం పెంచుకోవాల్సిన అవసరం లేదు.
బెడ్ కోసమే అయితే నేను తనతో ఉండల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు.

అయినా తనతో పరిచయం ఏర్పడేటప్పటికే నాకు స్టార్ డమ్ ఉంది.
బాలచందర్ సినిమాలు చేశాను. ఏవీఎం సంస్థలో ‘నోము లాంటి సినిమాలు చేశాను. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. తను నా కన్నా 5 – 7 ఏళ్లు పెద్దది.
అప్పటికే పెళ్లయిన స్త్రీ. నాకు ప్రపంచం గురించి సరైన అవగాహన లేదు. ఆ సమయంలో తనతో కలిసి ఉండాలన్న నిర్ణయం తీసుకోవడం నా పొరపాటు.
అనుభవరాహిత్యంతో అలా చేశాను. తనతో ఉన్న 1977- 87 మధ్యకాలంలో నా ఇన్కమ్ టాక్స్ రికార్డ్ చూసినా, తెలిసిన వారిని అడిగినా నేను ఎంత బిజీగా ఉంటే వాడినో అందరూ చెబుతారు. ఎప్పుడు ఔట్ డోర్ కి వెళ్లే వాడిని.
ఒక వ్యక్తిని ఎసెస్ చేసే సమయం అప్పట్లో నాకు లేదు. వాగ్వివాదాలు జరిపే సమయం కూడా లేదు” అని అన్నారు.
ఆస్తుల గురించి మాట్లాడుతూ మేం కలిసినప్పుడు తనకున్న ఆస్తి ఆళ్వార్ పేట్ లో ఒక ఇల్లు. ఎగ్మోర్ బెనిఫిట్ సొసైటీ ఫైనాన్స్ తో ఉన్న ఇంకొ ఇల్లు.
అందులో తొలి భర్త పేరు కూడా ఉందని కొన్నేళ్ల తర్వాత చూశాను.
ఇంకో విషయం ఏమిటంటే తనుకున్న ప్రాపర్టీ ని 87 ఏళ్లు అనుకుంటా..అమ్మి..మూకాంబికా కాంప్లెక్స్ లో తన పేరు మీద ఒక కమర్షియల్ ఫ్లాట్ కొనిచ్చా.
దాంతోపాటు భగవంతం స్ర్టీట్ లో కళా ఫ్లాట్స్లో తన పేరు , తన తమ్ముడు పేరుతో మంత్రం మరో ఫ్లాట్ కొనిచ్చా.
చెన్నైలో ఉమాపతి స్ర్టీట్ లో ఓ ఇండిపెండెంట్ హౌస్ నేను తన పేరు మీద కొన్నా. ఆ ఇండిపెండెంట్ హౌస్ కొనడానికి నేను… నా సొంత పొలాన్ని విక్రయించేశాను. అప్పుడు నేను అమ్మిన పొలం విలువ ఇప్పుడు రూ. 60 కోట్లు.
ఆమె ఆస్తులు ఏమయ్యాయో రికార్డులు చూసినా , వాళ్ల ఆడిటర్ ని అడిగిన అన్ని తెలుస్తాయి.
నా జీవితంలో అది తుఫాను సమయం. అందుకే ఆ రోజులను గుర్తు చేసుకున్న ఏమీ గుర్తు రావు.
అందుకే ఒకసారి ఫ్లైట్ లో తను నా పక్కన వచ్చి కూర్చుంటే నేను అక్కడి నుంచి లేచి వెళ్లా.
తను కనిపిస్తే నేను నెర్వస్ గా ఉంటానని అనదం అబద్ధం పరిశ్రమలో నాకు మంచి పేరు ఉంది. అది నా ప్రవర్తనతో తెచ్చుకున్న పేరు.
నా దృష్టిలో భార్యంటే భోగిమంటల్లో వేసే ముళ్లకంపల ఉండకూడదు.
హోమగుండంలో వేసే గంధపు చెక్కలా ఉండాలి.
ముళ్లకంపలా గుచ్చుకుంటూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయకూడదు.
సువాసనలు వెదజల్లుతూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందకరంగా , ఆహ్లాదకరంగా , ఆరోగ్యంగా మార్చాలి” అని చెప్పారు.