తెలుగుదేశం యాప్ లో మూడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వైకాపా నేత విజయసాయి రెడ్డి ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందిస్తున్న హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో ఉన్న ఐటి గిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో సైబరాబాద్ పోలీసులు శనివారం సాయంత్రం సోదాలు నిర్వహించారు.

కొన్ని హార్డ్ డిస్క్ లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దానిపై ఏపీ నుంచి పోలీసులు మాదాపూర్ కు రావడంతో ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలో సంచలంగా మారింది.

తెలుగుదేశం పార్టీకి ఐటి సేవలు అందిస్తున్న సేవా మిత్రా మొబైల్ యాప్ లో ఆంధ్ర ప్రదేశ్ చెందిన మూడు కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు.

మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ లో ఉన్న ఐటి గిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలుగుదేశం పార్టీకి యాప్ తయారు చేసి ఇచ్చిందని దీనిలో వార్తల్లో వారి ఆధార్ కార్డ్ కూడా వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

యాప్ ను డౌన్లోడ్ చేసుకునే ప్రతి తెలుగుదేశం కార్యకర్త కు ఈ సమాచారమంతా అందుబాటులోకి వస్తుందని ఆరోపించారు.

ఇదే ఐటి సంస్థ కూకట్పల్లిలోని ఇంకో కంపెనీ నుంచి వివరాలను సేకరించిందoటు వైకాపా ప్రతినిది తుమ్మల లోకేశ్వర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారిక ఫేస్ఋక్ పేజీలో సేవామిత్ర యాప్ వివరాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరవాణి ఆధారిత సేవలను తమకు అందించాలని వైజాగ్ లో ఉంటున్న బ్లూ ప్రోగ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను కోరిందని.

ఈ మేరకు ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాల ప్రజల ఆధార్ కార్డులు, ఏపీ స్మార్ట్ పల్స్ సర్వే, స్టేట్ రెసిడెoట్ డేటా హబ్ తో పాటు హైదరాబాద్లో ఉంటున్న కావ్య డేటా మేనేజ్మెంట్ సర్వీస్ నుంచి ప్రజాసాధికార వివరాలను తీసుకుందని లోకేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులకు వివరించారు.

ఈ డేటా మొత్తని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఐటి గీడ్్స ఇండియా సంస్థ వినియోగిస్తుందని తెలిపారు.

సుప్రీంకోర్టు 2014 లో జారీ చేసిన ఆదేశాల మేరకు ఏ రాజకీయ పార్టీ కూడా జాబితాను ఉంచుకోకూడదు.

ఇందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందన్నారు .

వీటి సాయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు 2014 సంవత్సరంలో ఓటరు జాబితాలో ఉన్న పేర్లను 2019లో తొలగించాలంటూ కొన్ని ఉదాహరణలు వివరించారు.

వైకాపా నాయకుల ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించి పోలీసులు ఐటి గిడ్స ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం నుంచి తనిఖీలు ప్రారంభించారు.

సంస్థ ప్రతినిధులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *