మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు…

జగన్‌కు ‘అభినందనలు’ తెలపడానికి వెళ్లిన నన్నపనేని.. షాక్ ఆమెకా? టీడీపీకా?
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. కానీ అప్పటికే ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు.

1.మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు.
2.కానీ అప్పటికే ఆయన ఇంటికి వెళ్లారు.
3.దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు.

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు చెప్పడం కోసం క్యాంప్ ఆఫీస్‌కి వెళ్లారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు పార్టీలతో సంబంధం లేదని.. మహిళా కమిషన్ చై‌ర్‌పర్సన్‌గా కాబోయే సీఎంని కలవడం నా బాధ్యత అని తెలిపారు.

జగన్ నాయకత్వంలో అత్యధిక మంది మహిళలు గెలిచారన్న ఆమె.. సమయం ఉంటే మహిళా సమస్యలపై జగన్‌తో మాట్లాడతానన్నారు.

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్న ఆమె.. తాను పదవికి రాజీనామా చేయాలనుకోవడం లేదున్నారు.

తనకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నందున పదవిలోనే కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

రాజకుమారి జగన్ క్యాంప్ ఆఫీసుకి వెళ్లే సరికే జగన్ ఇంటికి వెళ్లిపోవడంతో.. ఆమె నిరాశగా వెనుదిరినట్టు సమాచారం.

రాజకుమారి టీడీపీ హయాంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితురాలైన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి పులివెందుల, తిరుపతిల్లో జగన్ పర్యటించనున్నారు. దీంతో ఆయన తిరిగొచ్చాకే రాజకుమారి కలిసే అవకాశం ఉంది.

నన్నపనేని రాజకుమారి కుమార్తె, అల్లుడు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. రాజకుమారి కుమార్తె సుధ 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా వినుకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *