ఆ పూర్వమే అపూర్వం

పూర్వం….విద్యార్థి తప్పు చేసినపుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షిస్తాడు. దాని అర్థం క్రింది విధాలుగా ఉంటుంది.
- 1.మోకాళ్ళమీద కూర్చోబెడితే – వినయంగా ఉండాలని.
- నోటిమీద వేలు వేసుకోమంటే – నీగురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని.
- చెవులుపట్టుకోమంటే – శ్రద్ధగా వినమని.
- బెంచీ ఎక్కి నిలబడమంటే – నీవు చదువులో అందరి కంటే పైన ఉండాలని.
- చేతులెత్తి నిలబడమంటే – నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని.
- గోడవైపు చూస్తూ నిలబడమంటే – ఆత్మ పరిశీలన చేసుకోమని.
- తరగతిగది బయట నిలబెడితే – పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని.
- బ్లాక్ బోర్డ్ తుడవమంటే – తప్పులు సరిచేసుకోమని.
- ఏదైన విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే – గెలిచే వరకూ పోరాడమని.