స‌రైన టైం కోసం వేచి చూస్తోంద‌ట..మ‌రో మాజీ మంత్రి వంతు.. బాబూ రెడీగా ఉండండి..! ‌

రాష్ట్రంలో మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకోనుందా ? ఇప్ప‌టికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్‌ రెడ్డిల అరెస్టుతో త‌ల బొప్పిక‌ట్టిన టీడీపీకి ఇప్ప‌డు మ‌రో షాక్ త‌గ‌ల‌నుందా ? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్‌గా నిలిచిన నాయ‌కుడు చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు చుట్టు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది.

ఇప్ప‌టికే ఆయ‌న‌పై డాక్ట‌ర్ సుధాక‌ర్ విష‌యంలో తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. సుధాక‌ర్‌ను ఆయ‌నే రెచ్చ‌గొట్టి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు చేసేలా వ్యాఖ్య‌లు చేయించార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో చాన్నాళ్లుగా ఆయ‌న మౌనం వ‌హిస్తున్నారు. మీడియాకు కూడా చిక్క‌డం లేదు.

అయితే, తాజాగా ఆయ‌న‌పై నిర్భ‌య స‌హా కీల‌క‌మైన కొవిడ్‌-19 చ‌ట్టం కింద కూడా కేసులు న‌మోదు కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్‌ గదిలోకి మార్చారు.

అయితే తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలంటూ అయ్యన్నపాత్రుడు ఈనెల 15న మున్సిపల్‌ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. హాల్‌కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్‌ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు నోటి దురుసుతో ఫోటో తొలగించే అధికారం కమిషనర్‌కు ఎవడిచ్చాడంటూ విరుచుకుపడ్డారు.

స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్‌కు ఆమె తొత్తుగా మారారంటూ నోరు పారేసుకున్నారు. పోలీసులు, పెద్దల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం చిత్రపటాన్ని నెల రోజుల్లో యథాస్థానంలో పెట్టకపోతే కమిషనర్‌ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

‘కమిషనర్‌ ఆడ ఆఫీసర్‌ అయిపోయింది.. అదే మగవాడైతే వేరే విధంగా ట్రీట్‌మెంట్‌ ఉండేది…’ అంటూ బెదిరించారు.

దీంతో కమిషనర్‌ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.

కమిషనర్‌ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

అదేవిధంగా ఇదే కార్య‌క్ర‌మానికి సంబంధించిన కొవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని, గ్యాద‌రింగ్ చేశార‌ని మ‌రో రెండు కేసులు న‌మోదు చేశారు.

దీంతో రేపో మాపో ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అచ్చెన్న అరెస్టుతో టీడీపీ బీసీ అస్త్రం ప్ర‌యోగించి.. బీసీ నాయ‌కుల‌ను తొక్కేస్తున్నారంటూ హ‌డావిడి చేసింది.

ఇప్పుడు అయ్య‌న్న కూడా బీసీ నేత కావ‌డంతో ఇది మ‌రింత వివాదానికి తావు లేకుండా ఉండేందుకు స‌రైన టైం కోసం వేచి చూస్తోంద‌ట‌. మ‌రి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *