ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర బంద్*

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని, కోరుతూ శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని, పలు పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాల మద్దతుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ తో విభజన హామీల సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరగనుంది.
ఈ బంద్ కు తెలుగుదేశం, కాంగ్రెస్ , వామపక్షాలు, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఈ బంద్కు లారీ ఓనర్స్ అసోసియేషన్ ,చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రైవేటు పాఠశాల ,కళాశాల సంఘాలు కూడా బంద్ కు సంఘీభావం తెలిపాయి.
బంధు సందర్భంగా జరిగే ర్యాలీలు, నిరసన ప్రదర్శనలో , తెలుగుదేశం నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి పాల్గొంటారు.
ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నట్టు అమరావతి ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.
ఏపీ ఎన్జీవో సంఘం బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ నిరసన ప్రదర్శనలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.
విశాఖపట్నంలో ను ప్రధాన కూడళ్లలో ఉద్యోగ ,విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టనున్నాయి. ఈ బందుకు బీజేపీ, వైకాపా, జనసేన దూరంగా ఉన్నాయి