జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకె ళ్లాలి వైసిపి అధ్యక్షులు మండపాటి జానకీరామరాజు(జానీ)

వైఎస్సాఆర్ సీపీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల తో పాటు కొత్తగా రైతుల సంక్షేమానికి , అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు మండ పార్టీ జానకిరామరాజు (జానకి )అన్నారు. శుక్రవారం ఉదయం రింగురోడ్లు గల వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయవలసిన ఎంతైనా ఉందన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధనకు అలుపెరుగని పోరాటం చేసి పాదయాత్ర చేపట్టిన వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలను ఈనెల 22న పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు అమర్నాథ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రింగురోడ్డు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొనాలని ఆయన కోరారు. పేదలకు బియ్యం పంపిణీ, వస్త్రాలు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను అమర్నాథ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తరలిరావాలని జానకీరామరాజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్,బోడ్డేడ శివ, ఏవీ రత్నకుమారి,సూరిశెట్టి రమణ అప్పారావు, కుండల రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ పోలమరశేటి మురళి, లట్టాల మురళీ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *