చరిత్రను వక్రీకరించిన ‘కొత్త పలుకు’

నేటి యువతకు ‘కొత్త పలుకు’ చరిత్ర తెలియదని అనుకుంటుంది. అంతేకాదు..రాజకీయాలే తెలియవని ‘కొత్త పలుకు’ నమ్మకంల ఉంది. అందుకే అబద్దాల అక్షరాలకు హద్దు లేకుండా పోతుంది. ఈ వారం ‘కొత్త పలుకు’లో నాకు చాలా ఆశ్చర్యం వేసినవి మూడు అవి 1. అమరావతికి వెయ్యేల్లా చరిత్ర ఉందంట..! 2. మండలి చైర్మన్‌ అమరావతికి ప్రాణవాయువు అందించారట..!. 3. అమరావతిని అడ్డుకోకపోతే ఏపీలో బీజేపీ నష్టపోతుందట..! ఇక యధావిథిగానే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై ‘కొత్త పలుకు’ తన అక్కసును వెళ్లగక్కింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొత్త పలుకు అటువంటి పదాలను రాయడానికి కనీసం ఆలోచన కూడా చేయదు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచి ఆ అక్షరాలు అర్ధంపర్ధంలేని ఆవేశంతో ఊగిపోతూనే ఉన్నాయి. జర్నలిజం అనేది ఓ కులానికే, ఓ నాయకుడికో ఉపయోగపడకూడదు. జర్నలిజం అనేది ప్రజలకు, సమాజానికి ఉపయోగపడాలి. ‘కొత్త పలుకు’ రాతలు కులరాతలుగా చరిత్రలో మిగిలిపోతాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే వారి ప్రయోజనాల కోసం చరిత్రనే వక్రీకరిస్తున్నారు.

ఈ వారం ‘కొత్త పలుకు’లో అమరావతికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందని రాయడం చాలా చాలా ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన పుస్తకాన్ని ఉదహరించారు. ‘భగవంతుని మీద పగ’లో అమరావతి గురించి కవి సామ్రాట్ ప్రస్తావించారు అని ‘కొత్త పలుకు’లో రాసుకొచ్చారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యానారాయణ గారు ప్రస్తావించిన అమరావతి వేరు.
మీరు రాసుకొచ్చిన అమరావతి వేరు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రస్తావించిన అమరావతికి వెయ్యేళ్లు అంతకంటే ఎక్కువ చరిత్ర ఉంది. ఎన్నో యుద్ధాలు చూసింది. ఎంతో మంది పాలకులను చూసింది. బుద్ధుని బోధనలూ విన్నది. ఎంతో మంది చరిత్రకారుల పుస్తకాల్లో అక్షరమైంది. మీరు ‘చంద్రబాబు అమరావతి’ని కాపాడటానికి చరిత్రలో ‘ ఓ అధ్యాయమేనా అమరావతి’ని వాడుకుంటే ఎలా?!. పాపం కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్‌లు తెలియని నేటి యువత ‘కొత్త పలుకు’ రాసింది నిజమనుకునే ప్రమాదముంది. అలా అనుకోవాలనే మీరు రాసింది అనుకోండి. మీ బాస్ చంద్రబాబు చరిత్రను పాఠ్యంశాలను తొలగించాలని అంటుండేవారు. ఆయన మాటల్లో ఇంత కుట్ర దాగుందని నాకిప్పుడే అర్ధమవుతుంది. చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి తొలగిస్తే హిస్టరీని ఎలాగైనా వాడుకోవచ్చు. ఆయన చేసిన పాపాలు చరిత్రలో లేకుండా పోతాయనే చంద్రబాబు చరిత్ర వల్ల ఏం లాభం అనే ప్రకటనలు చేసి ఉండొచ్చు. చరిత్ర చెరిపితే పోదు..ఈ భూమిపై మానవజాతి ఉన్నంత కాలం చరిత్ర బతికే ఉంటుంది. ఎందుకంటే..చరిత్ర దాగున్న మట్టి పొరలు, కొత్త అధ్యాయాలు తవ్వే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఆ మట్టి పొరలు, ఆ కొత్త అధ్యాయాలు మీ పాపాలను మోసి భవిష్యత్తు తరాలకు చెబుతూనే ఉంటాయి. మీరు కాపాడాలి అనుకుంటుంది ‘చంద్రబాబు అమరావతి’ గురించి ‘చరిత్రలో ఉన్న అమరావతి’ గురించి కాదు. అమరావతి అని పేరు పెట్టినంత మాత్రానా ‘చంద్రబాబు అమరావతి’కి వెయ్యేళ్ల చరిత్ర రాదు. ‘చంద్రబాబు అమరావతి’ వయసు కేవలం ఐదేళ్లే అని విషయాన్ని ‘కొత్త పలుకు’ కలం గుర్తు పెట్టుకోవాలి. చరిత్రకు ఎప్పుడూ చెద పట్టదు..ముందు మీ బుర్రలకు పెట్టిన చెదను వదిలించుకోవాలి. అప్పుడే..మీ పత్రికపై
పాఠకులకు నమ్మకం కలుగుతుంది. చివరికి మీ రాజకీయాల కోసం చరిత్రను కూడా చంపేస్తున్నారు.

‘కొత్త పలుకు’లో అక్షరలు నాకు చాలా కామెడీగా అనిపిస్తాయి. ఎందుకంటే.. మండలి ఛైర్మన్ షరీఫ్ పై ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపేలా చేసింది చంద్రబాబు.
తనకు సంబంధం లేకపోయినా మండలి గ్యాలరీలో వచ్చి కూర్చొని షరీఫ్‌ను మానసికంగా చంద్రబాబు ప్రభావితం చేశారు. చైర్మన్‌ సీట్‌లో ఉన్న షరీఫ్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపే ముందు ఓ మాట అన్నారు. బహూశ ఆ వీడియో ‘కొత్త పలుకు’ విన్నదో? వినలేదో నాకు తెలియదు. ఆ వీడియోలో మండలి చైర్మన్‌ షరీఫ్ అన్న మాటలు చాలా క్లియర్‌గా ఉన్నాయి. “రూల్స్‌కు విరుద్ధమైనా నా విచక్షణాధికారం ఉపయోగించి బిల్లును సెలక్టివ్ కమిటీకి పంపిస్తున్నాను” . ఈ మాటలు ‘కొత్త పలుకు’ చెవిలో పడలేదా?. పడినా పడనట్లు ఉన్నారా? . చట్ట సభల రూల్స్‌ తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ప్రతినిధుల సభ నిర్ణయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, తమ పరిధులు దాటి, సూచనలు, సలహాలు ఇవ్వడం మాని మండలిని చంద్రబాబు అండ్ గ్యాంగ్ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంది. చంద్రబాబు తన స్వార్ధం కోసం సభా సంప్రదాయాలను మంట కలిపారు. తన ఆర్ధిక ప్రయోజనాల కోసం రూల్స్‌ బుక్‌ తలరాతనే మార్చేశారు. ఇదే.. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేసి ఉంటే ..’కొత్త పలుకు’లో అక్షరాలు మరో విధంగా ఉండేవి. నేతను బట్టి అక్షరాలను మారిస్తే అది జర్నలిజం ఎలా అవుతుంది?. ఇప్పుడు శాసన మండలి అవసరమా? అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించే సరికి టీడీపీ ఎమ్మెల్సీలు లబోదిబోమంటున్నారు. 15 మంది టీడీపీ ఎమ్మెల్సీలు వైఎస్ఆర్‌ సీపీకి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. చంద్రబాబు, లోకేష్‌లను కలిసి తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ” మీ ఆర్ధిక ప్రయోజనాల కోసం మేం పదవులు తాకట్టు పెట్టాలా?” అని చంద్రబాబు, లోకేష్‌లను ఎమ్మెల్సీలు నిలదీసినట్లు సమాచారం. సీన్‌ రివర్స్‌ అవుతుండటంతో మండలి చైర్మన్‌ షరీఫ్ మాట మార్చారు. బిల్లు సెలక్టివ్ కమిటీలోకి వెళ్లలేదు ప్రాసెసింగ్‌లో ఉందన్నారు.

వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కాసేపు రాజకీయ విలువలు అనే మాట పక్కన పట్టి గేట్లు ఎత్తితే టీడీపీ ఎమ్మెల్సీలే కాదు, ఎమ్మెల్యేలు కూడా ఉండరనే చంద్రబాబుకు తెలియనది కాదు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిలో ఉన్న నైతికత అనే పదవం ఒక్కటే టీడీపీని కాపాడుతుంది. ఆ ..రాజకీయాల్లో ఇవన్నీ సహజం అనుకుంటే చంద్రబాబు తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయం. బిల్లును చంద్రబాబు మండలిలో అడ్డుకుంటారు, ఇబ్బంది అవుతుందని ముందుగానే ప్రభుత్వంలో చర్చకు వచ్చింది. అయినా సరే ఫెయిర్ పాలిటిక్స్‌ చేద్దామని జగన్‌ అన్నారంటే ఆయన రాజనీతికి జై కొట్టాలని అనిపిస్తోంది. చంద్రబాబులాగా ఏనాడు వైఎస్‌ జగన్‌ బ్యాక్‌ డోర్ పాలిటిక్ప్ చేయలేదు. అప్పుడు ఇప్పుడు ఆయన చేస్తున్నది ఫెయిర్ పాలిటిక్స్‌. సోషల్ మీడియాలో నిన్న ఓ వీడియో ట్రోల్ అవడాన్ని చూశాను. దానిలోబీజేపీ నేత ఒకరు చెబుతున్న మాటలు వింటేచంద్రబాబుకు రాష్ట్రాబివృద్ధి కంటే వైఎస్‌ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే ఎజెండాగా పని చేస్తున్నారు. బీజేపీ నేత ఏం చెప్పారంటే “చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పీఎం మోదీని కలుస్తారు. ఆయన రాష్ట్రం గురించి మాట్లాడరు. వైఎస్‌ జగన్‌ మీద కేసులు పెట్టాలని అడుగుతారట..! ప్రధాని అదేంటీ అవి చూసుకోవడానికి కోర్ట్‌లు ఉన్నాయి కదా అంటే చంద్రబాబు నోట్లోంచి మాట రాదట..!”. ఇదీ చంద్రబాబు రాజకీయం. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల గురించి పీఎం దగ్గర మాట్లాడకుండా వైఎస్‌ జగన్‌ను కేసుల్లో ఇరికించాలని కోరాడంటే చంద్రబాబు ఎంతటి రాక్షస మనస్తత్వం కలవాడో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు వారు చట్టసభలను గౌరవిస్తారని అనుకోవడం పొరబాటు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవకపోతే టీడీపీనే కాదు తనను తాను నిండా ముంచుకున్నవాడు అవుతాడు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి.

‘కొత్త పలుకు’లో అక్షరాలకు లాజిక్ ఉండదు. ఏదో అలా వెళ్తుంటాయి. ఆయన దృష్టిలో జనసేన వెళ్లి బీజేపీకి మద్దతుగా ఇవ్వగానే బీజేపీ నేతలు అమరావతికి మద్దతు ఇవ్వాలి అన్నట్లు రాశారు. ఇలా వెళ్లి అలా మాట్లాడటానే మద్దుతు ఇస్తారా?. ‘కొత్త పలుకు’లో మీ అక్షరాలు చదివిన తరువాత మీరే పనికట్టుకుని పవన్ కల్యాణ్‌ను ఆదరాబాదరాగా ఢిల్లీ పంపించి..బీజేపీతో కలిపినట్లుంది. టీడీపీ ఓ ప్రాంతీయ పార్టీ, జనసేన ను ప్రాంతీయ పార్టీ కూడా అనలేం. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేని పార్టీ అనాలి. బీజేపీ 2 సీట్ల నుంచి 304 సీట్లు గెల్చుకుని దేశ రాజకీయాలను శాసిస్తున్న పార్టీ. అటువంటి పార్టీకి ప్రతి రాష్ట్రంపై కొన్ని లెక్కలుంటాయి. రాజకీయ వ్యూహాలుంటాయి.పవన్ కల్యాణ్ వెళ్లి నా మద్దతు మీకే అనగానే కాషాయవాదులు బట్టలు చించుకుని ..పవన్ ఏదీ అనమంటే అదీ అనరు. ఎందుకంటే.. బీజేపీ రాజకీయ సిద్దాంతం ఉన్న పార్టీ, టీడీపీలాగా సిద్దాంతంలేని పార్టీ కాదు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ రాజకీయాలను సినిమా కథ అనుకుంటున్నారు. సినిమా కథను డైరక్టర్‌ మీరు చెప్పినట్లు మార్చవచ్చు..రాజకీయాలు అలా కాదు. “వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే వరకు నిద్ర పోను” ఢిల్లీ వెళ్లక ముందు పవన్ కల్యాణ్ డైలాగ్. వెళ్తి బీజేపీ నేతలతో మాట్లాడిన తరువాత “రాజధానుల విషయం రాష్ట్రాల పరిధిలోనిది” ఇది పవన్ కల్యాణ్ డైలాగ్. ఇక్కడ ఏం అర్ధమవుతుంది. పవన్ కల్యాణ్‌కు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదు పవన్ కల్యాణ్‌కు ఢిల్లీ బీజేపీ నేతలు గట్టిగా క్లాస్‌ పీకడంతో తాను మాట్లాడిన మాటలు తప్పని పవన్ కల్యాణ్‌ తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీలోకి పంపిన లక్ష్యం నెరవేరడం లేదు.దీంతో చంద్రబాబు అండ్‌ కోకు చిర్రెత్తుకు వస్తుంది. దీంతో…అమరావతికి మద్దతు ఇవ్వకపోతే ప్రజల ఆదరణ పోతుంది, రాష్ట్రంలో రాజకీయ లబ్ది ఉండదని ‘కొత్త పలుకు’లో అమరావతితో బీజేపీ నేతలకు సంబంధమే లేదు. విశాఖ ఎగ్జిక్యూగివ్ రాజధాని అంటే మొదట సంతోష పడింది బీజేపీ వారే. ఇప్పటికైనా..మీ ప్రయోజనాల కోసం ఇతరులను వాడుకోవడం మానితే మంచిది. లేదంటే ప్రజలు మరోసారి ఛీ కొడతారు. ఢిల్లీలో చంద్రబాబు ముఖం చూపించుకోలేక దత్త పుత్రుడిని పంపితే ఫలితం గుండు సున్నా.

‘కొత్త పలుకు’కు స్పీకర్ తమ్మినేని అరిచింది గుర్తుంటుంది. మండలి చైర్మన్ షరీఫ్ మండలి రూల్స్‌నే తుంగలో తొక్కింది గుర్తుండదు. స్పీకర్ తమ్మినేని అరుస్తున్నారంటే ..టీడీపీ నేతలు ఇర్రిటేడ్ కలిగిస్తే అరుస్తున్నారు. ఛాంబర్ దగ్గరకు దూసుకొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే అరుస్తున్నారు. సభను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్పీకర్‌కు లేదా?. ఈ ప్రశ్నకు ‘కొత్త పలుకు’ సమాధానం చెప్పాలి. షరీఫ్ చేస్తే కరక్ట్ తమ్మినేని చేస్తే తప్పు. ఏం కలం అయ్యా నీది. నీది ఓ జర్నలిజమా?. ‘కొత్త పలుకు’కు ఓ సైడే చూడటం వచ్చా?. రెండు వైపులా చూడటం రాదా?. ఎందుకని..?. తప్పు చేస్తే ఎవరు చేసినా తప్పే..మంచి చేస్తే ఎవరు చేసినా మంచే అంతే కాని..తమ్మినేని చేస్తే తప్పు, షరీఫ్ చేస్తే కరక్ట్ అని రాయడం కలానికి మంచిది కాదు. జర్నలిజానికి అసలే మంచిది కాదు.జర్నలిజాన్ని జనాల కోసం వాడాలి.జీతగాడిగా మీ బాస్‌ల కోసం వాడకూడదు.

ప్రపంచ విజేత అలెగ్జాండర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రపంచ విజేత కాదా, అవునా అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల వాదనలు ఉన్నాయి. ఆ వాదనలు ఇక్కడ అప్రస్తుతం.అయితే..అలెగ్జాండర్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీరు ఇప్పటికైనా రియలైజ్ కావాలని. అలెగ్జాండర్ చాలా చిన్న వయసులోనే చనిపోయారు. చనిపోయే ముందు తన సైనికాధిపతులను, కుటుంబ సభ్యులను పిలిచి “నేను ఇక బతికే చాన్స్ లేదు. నేను చనిపోయిన తరువాత నా రెండు చేతులను శవపేటి నుంచి బటయకు పెట్టి నన్ను ఊరేగిస్తూ శ్మశనానికి తీసుకెళ్లి, అక్కడ కూడా నా రెండు చేతులు బయట పెట్టి ఖననం చేయండని చెబుతాడు” ఎందుకని అలెగ్జాండర్‌ను ఓ సైనికాధికారి అడుగుతాడు అప్పుడు మళ్లీ ఆ గ్రీస్‌ చక్రవర్తి ” రెండు చేతులు ఎందుకు బయట పెట్టమంటున్నానంటే..నేను ఎన్నో రాజ్యాలను కొల్లగొట్టాను, ప్రజల సొమ్మును కొల్లగొట్టాను, టన్నుల కొద్దీ వజ్ర, వైడుర్యాలు, బంగారం కొల్లగొట్టాను అయినా ఏవీ నాతో రావడం లేదు అని చెప్పడానికి నా రెండు చేతులు బయట పెట్టమంటున్నాను”అని ఆ సైనికాధికారికి అలెగ్జాండర్‌ సమాధానం ఇచ్చారు. తరువాత అలెగ్జాండర్ చనిపోవడం, ఆయన కోరిన విధంగానే ఆయనను ఖననం చేయడం జరిగింది. ఇది ఎందుకు చెబుతున్నానో ‘కొత్త పలుకు’కు ఇప్పటికే అర్ధమయ్యి ఉంటుంది. రెండు ఎకరాలు నుంచి 2 లక్షల కోట్లు బాబు సంపాదించారని చెబుతున్నారు. అలాగే ‘కొత్త పలుకు’కలం కూడా చిన్నస్థాయి నుంచి వేల కోట్లకు అధిపతి అయిందని అనుకుంటున్నారు.అవన్నీ కూడా ప్రజల సొమ్ములే. ఏవీ మనతో రావు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. శాశ్వతం రాజ్యం, ప్రజలు..రాజకీయాలు , ధనం సంపాదన కాదు. శాశ్వతమైన వాటి కోసం ‘కొత్త పలుకు’కు పదును పెట్టండి. అశాశ్వతం అయిన వాటి కోసం ఎందుకు ‘కొత్త పలుకు’ ‘సిరాను వృధా చేస్తారు..?!!! మీరు ఎంత రాసినా..మీ అక్షరాలను ఎంత వండినా సోమవారం శాసన మండలిని రద్దు చేస్తూ శాసన సభ తీర్మానం చేయడం ఖాయం. ఆ తరువాత టీడీపీ కూడా ఖాళీ అవడం నిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *