టీడీపీ పై వ్యతిరేక పవనాలు…. తాజాగా తెలుగుదేశం ఒంటరిగా బరిలో

  • ప్రత్యేక హోదా పై టీడీపీ ద్వంద్వ వైఖరికి నిరసన లు,
  • ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు,ప్రజల్లో నానాటికీ
  • తీవ్రమవుతున్న వ్యతిరేక త, పార్టీని వీడుతున్న టీడీపీ శ్రేణులు,
  • కీలక నేతల చేరికతో వైసీపీలో కల కలలు,
  • ఎన్నికల వేళ స్పీడ్ పెరిగిన ఫ్యాన్ గాలి
  • ఇవన్నీ కలిపి చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అంటే అవును అనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు జోరుగా వస్తున్నాయా అంటే అవుననే చెబుతున్నారు విశ్లేషకులు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అంటే నమ్మి అధికారం అప్పగిస్తే వారి ఆకాంక్షలను ఏ మాత్రం నెరవేర్చకపోవడం తో పాటు అంతులేని అవినీతి లో ప్రభుత్వం కొట్టుకుపోవడంతో టీడీపీ కోటలు కుప్పకూలడం ఖాయమని అంటున్నారు.

దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల వేళ టిడిపి రోజురోజుకు కాళీ అవుతున్న తీరు ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిదాయకంగా మార్చాయి.

సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారిక పార్టీలోకి వలసలు కనిపిస్తూ ఉంటాయి.

కానీ దానికి భిన్నంగా ప్రతిపక్షంలోకి టీటీడీపీ కీలక నేతలు క్యూ కట్టి ఉండడం విశేషం.

ఈ పరిణామాలతో సీఎం చంద్రబాబు నాయుడు బెంబేలెత్తి పోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

టిడిపిలో భవిష్యత్తు లేదని వైసీపీలోకి చేరికలు పెరుగుతున్నాయని ఎన్నికల వేళ ఫ్యాన్ మరింత పెంచుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

టిడిపి పట్ల పెరుగుతున్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మలుచుకోవడంలో వైసిపి సఫలం అవుతుందని అంటున్నారు

రాజకీయ భవిష్యత్తు కోసమే…..

కొంతకాలంగా టిడిపి వీడి వై.సి.పి.లో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.

కాంగ్రెస్ బీజేపీ నుంచి వైసీపీలో చేస్తున్న వారితో పోలిస్తే టీడీపీ నుంచి 90% పైగా ఉండడం గమనార్హం.

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ చేరికలు ప్రజానాడి అద్దం పడుతున్నాయి అన్న వాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

టీడీపీని వీడిన వారిలో ఉద్దండులు గా ఉన్న నేతలు కూడా ఉండడం.

విశేషం బుధవారం కూడా పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు.

వాస్తవానికి కొన్ని రోజులుగా ఈ చేరికలు కొనసాగుతూ ఉన్నాయి.

ఒకసారి ఆ జాబితాను పరిశీలిస్తే…

లోక్సభలో టీడీపీ పక్ష నాయకుడు తోట నరసింహం అతని భార్య వాణి తో కలిసి వైసీపీలో చేరారు.

రఘురామకృష్ణంరాజు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్, గుంటూరు పశ్చిమ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్, రాజంపేట నుంచి మేడ మల్లికార్జున రెడ్డి సైకిల్ వీడి ఫ్యాన్ కింద కి చేరారు.

వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో మంచి పట్టు ఉన్న మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, ఆమె కుమారుడు బాబు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుధ, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన రావు, తాడిశెట్టి వెంకట్రావు, బ్రహ్మానంద రెడ్డి, జగన్ చెంతకు క్యూ కట్టారు.

ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ సైతం వైసిపి కండువా కప్పుకున్నారు. బిజెపి ఎమ్మెల్యే బాబ్జి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, పారిశ్రామిక వేత్త జై రమేష్, నార్నే శ్రీనివాస రావు, పొట్లూరి ప్రసాద్, పోచా బ్రహ్మానంద రెడ్డి, హాస్య నటుడు అలీ, నటుడు రాజా రవీంద్ర, విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు, ఉడుత శ్రీనివాస్, గోరంట్ల మాధవ్…. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.

ప్రభుత్వంపై నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకత గుర్తించి వీళ్లంతా రాజకీయ నిర్ణయం తీసుకుంటే టిక్కెట్లు రాక వీడి వెళ్తున్నారు అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజా క్షేత్రంలో క్షేత్రంలో లో దిగ జారి పోయిన టీడీపీ గ్రాఫ్

గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న టిడిపి గ్రాఫ్ గత అయిదేళ్లలో వేగంగా పడిపోయింది.

రాజధాని అమరావతి కి కనీస రూపం లేకపోవడంతో పాటు ప్రభుత్వంపై పెల్లుబికిన అవినీతి ఆరోపణలు ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచాయని విశ్లేషకులు అంటున్నారు.

కాళీ ఖజానా… ఉత్త చేతులతో వచ్చాము… అని చెప్పుకునే చంద్రబాబు తన హంగు ఆర్బాటాలు కోసం మాత్రం వందల కోట్లు ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది.

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో లో చంద్రబాబు ద్వంద్వ వైఖరి కూడా ఆయన పట్ల నమ్మకాన్ని పోగొట్టింది అని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

నాలుగేళ్ల పాటు ప్రధాని మోడీ తో చెట్టా పట్టాలేసుకుని తిరిగి, స్పెషల్ ప్యాకేజ్ కి ఒప్పుకుని ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్న చంద్రబాబు కుటిల రాజకీయ డ్రామాలను ప్రజలు పసిగడుతున్నారు అని అంటున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో లో చంద్రబాబు యూటర్ను లతో ఏపీ ప్రజలు తీవ్ర ఆవేదనకు గురి అయ్యారని అన్నారు. ఇదంతా గమనించిన కీలక నేతలు వరుసగా టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు అన్ని విశ్లేషకులు అంటున్నారు.

చంద్రబాబుకి రెండోసారి అధికారం ఎప్పుడూ కలే…

అధికారం దక్కించుకోవడం కాదు దానిని కాపాడుకోవడం సరైన రాజనీతిజ్ఞుడు లక్షణం కానీ ప్రతి ఎన్నికలలో చంద్రబాబు తన జిమ్మిక్కులను నమ్ముకుంటారు. ఈ కారణాలతోనే ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.

1994 లో కనివిని ఎరుగని రీతిలో ఉమ్మడి ఏపీ లో టీడీపీ అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు ను రాజకీయ వెన్నుపోటుతో పదవీచ్యుతుణ్ని చేసి సీఎం కుర్చీ ఎక్కాడు అని చంద్రబాబుపై చెరిపివేయలేని మచ్చ పడింది.

చంద్రబాబు నేతృత్వంలో లో 1999 ఎన్నికలలో పోటీకి దిగింది. అప్పుడు విజయం సాధించిన చంద్రబాబు 2004 ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికలలో కూడా అధికారాన్ని దక్కించుకోలేకపోయారు.

రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికలలో అత్తెసరు ఓట్లతో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు.

ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న విశ్వప్రయత్నాలు తీవ్ర రాజకీయ ప్రతికూలతల నేపథ్యంలో ఫలించే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.

కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన చంద్రబాబు ఆపై తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆపై జరిగిన కీలక పరిణామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం పీఠం అధిష్ఠించారు.

అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా టీడీపీ వంటరిగా పోటీ చేయలేదు.

పార్టీ బరిలోకి దిగిన తొలి ఎన్నికలలోనే సంజయ్ విచార మంచ్ తో పొట్టు పొత్తు పెట్టుకుంది. అప్పటి నుంచి టీడీపీ పొత్తు రాజకీయాలతోనే పబ్బం గడుపుకుంటూ వస్తోంది. టిడిపి నాయకత్వం ఎన్టీఆర్ నుండి చంద్రబాబు చేతిలోకి వచ్చింది.

తరువాత కూడా పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగలేదు. కానీ తాజాగా ఒంటరి పోరుకు సిద్ధమైంది. చంద్రబాబు ఆధ్వర్యంలో తొలిసారిగా 1999 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది.

వాజ్పేయి సహకారంతో ఇక్కడ చంద్రబాబు గట్టెక్కారు. ఆపై అలిపిరి ఘటన తర్వాత తనతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూడా ముందుకు నడిపించి బోర్ల పడ్డారు. 2004 ఎన్నికల్లో బిజెపితోనే జత కట్టి పరాజయాన్ని చవిచూసారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో బాబు నేతృత్వంలోని తెలుగుదేశం మహాకూటమితో కలిసి ఎన్నికల్లో కి వెళ్ళింది. trs వామపక్షాలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నారు. 2014లో బీజేపీ- జనసేన- టీడీపీ కూటమిగా పోటీ చేశాయి.

తాజాగా తెలుగుదేశం వంటరిగా బరిలో దిగుతుంది. అయితే ఈ తాజా పోరు ఆ పార్టీకి కలిసివస్తుందా వేచి చూడాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *