నా(ఈ )కాలపు నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్

ఒకవైపు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వెన్నుపోటు నాయకుడు, కుల బలం, ధన బలం, మీడియా బలం మరోవైపు అతడొక్కడే.

ఆ యాత్రలో అతను రైతుల కష్టాలు చూశాడు, వృద్ధుల గోడు విన్నాడు ,పేదవారికి నేనున్నాను అన్నాడు.

మొత్తానికి పేదరికం అతి పెద్ద జబ్బు అని తెలుసుకున్నాడు దానికి సంక్షేమమే మందు అన్నాడు.

సంక్షేమాన్ని హేళన చేసే పత్రికలు, మధ్యతరగతి మేధావులకు నాది ఒక సూటి ప్రశ్న .

మీకు మీ తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి మీ విద్యా, వ్యాపారాన్ని కావలసిన పెట్టుబడి అందిస్తారు .

మరి పేదవారి మాట ఏమిటి ?

మీరెందుకు పత్రికలకు కార్పొరేట్ కీ ఇస్తున్న సబ్సిడీని ప్రశ్నించారు? సంక్షేమంలో అవినీతి ఉందని సంక్షేమాన్ని రద్దు చేస్తారా? మీ చేతి పై కురుపులు వేస్తే చేతిని నరుకుంటరా?

అందుకే అతను రైతులకు ఉచిత విద్యుత్, వృద్ధులకు పింఛన్ , పేద వారికి ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ,వైద్యానికి ఆరోగ్యశ్రీ మనలోని మానవత్వాన్ని నిద్రలేపే టందుకు 108 ప్రవేశపెట్టాడు.

చివరకు వెన్నుపోటు పై విశ్వసనీయత తో విజయం సాధించాడు .

తిరిగి 2009లో మహా కూటమిని ,తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని, మీడియాను ఎదుర్కొని గెలుపును నిలబెట్టుకున్నాడు .

అతనే డాక్టర్ వైఎస్ఆర్( YSR).

ఒక యాత్ర ఒక మనిషి జీవితాన్ని మారుస్తుందని చేగువేరా లాటిన్ అమెరికా విప్లవాన్ని చదివిన తెలుసుకున్నాను (చేగువేరా Poster మన పవన్ కళ్యాణ్ సినిమాల్లో తప్పనిసరిగా ఉంటాడు ).అలాగే డాక్టర్ వైయస్సార్ను చూశాను.

డాక్టర్ వైయస్ఆర్ జీవితంలో నాటకీయత లేదు ఒక్క అతని చావు తప్ప .కానీ అతని జీవితంలోని యాత్రను అద్భుతంగా క్యాప్చర్ చేసిన డైరెక్టర్ మహీ V రాఘవ గారికి అంతే అద్భుతంగా నటించిన మమ్ముట్టి గారికి హాట్సాఫ్.

చివరగా ఈ సినిమాను అందరూ చూడండి సాటి మనిషికి సహాయం చేసి సాధారణ పొలిటిషన్ నుంచి నాయకుడిగా ఎదిగిన డాక్టర్ వైఎస్ఆర్ మాదిరి మనము కూడా పక్కవారికి సహాయం చేసి మంచి వారు గా మిగులుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *