ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన జడ్జి

మంత్రి ఈ నెల 16న తిరుపతిలో సమావేశం నిర్వహించారని జడ్జి గుర్తు చేశారు. తనను అభ్యంతకరమైన పదజాలంతో దూషించారని.. ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స తీసుకుంటే అవహేళనగా మాట్లాడారని మండిపడ్డారు.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డిఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఓ జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. మంత్రి ఓ ప్రెస్‌మీట్‌లో తనను అభ్యంతకరమైన పదజాలంతో దూషించారని చిత్తూరు జిల్లాకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
తనపై దాడికి సంబంధించిన ఈనెల 15న పోలీసులు కేసు నమోదుచేశారని.. ఈ ఘటనపై స్పందిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 16న తిరుపతిలో సమావేశం నిర్వహించారని జడ్జి గుర్తు చేశారు. తనను అభ్యంతకరమైన పదజాలంతో దూషించారని.. ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స తీసుకుంటే అవహేళనగా మాట్లాడారని మండిపడ్డారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులను అవమానకరంగా సంబోధించడం నేరమవుతుందని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేశారు.
చిత్తూరు జిల్లాకు చెందిన రామకృష్ణ
జూనియర్ సివిల్ జడ్జి.. కానీ ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. అయితే ఆయనపై రెండు
వారాల క్రితం దాడి జరిగింది. ఈ దాడి వెనుక మంత్రి రామచంద్రారెడ్డి హస్తం
ఉందని గతంలోనే ఆరోపించారు. మంత్రికి సమీప బంధువుకు వ్యతిరేకంగా తాను పోరాటం
చేస్తున్నందునే.. పెద్దిరెడ్డి తనను టార్గెట్ చేశారని రామకృష్ణ
అంటున్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది
ఆసక్తికరంగా మారింది.