గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్, నాలుగున్నర ఏళ్ళల్లో ఏపీలో గణనీయమైన అభివృద్ధి

గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రం ఈ నాలుగున్నర సంవత్సరాలలో గణనీయంగా అభివృద్ధి సాధించింది అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో పథకాలు అమలు చేస్తుందని అన్నారు. విజయవాడ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.

రాష్ట్రవిభజన కష్టాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఉత్పాదకతను పెంచుతోందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్యంలో అగ్ర స్థానంలో ఉంది అని చెప్పారు.

అంతేకాక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి అని చెప్పారు. రాష్ట్రంలో నగరాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేగాక వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు.

ప్రతి గ్రామానికి సిసి రహదారులు నిర్మించామన్నారు. ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందించామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటిని తీసుకువచ్చామన్నారు.

అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పాలనను సులభతరం చేశామన్నారు.

రాయలసీమను ఉద్యాన హబ్ గా మారుస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, నిర్మాణాన్ని నిత్యం ప్రభుత్వం సమీక్షిస్తున్నారు.

త్వరలోనే గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామన్నారు. నాలుగున్నర ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని చెప్పారు. నిరుద్యోగులకు భృతి ఇస్తున్నామని అన్నారు.

ముఖ్యమంత్రి యువ నేస్తం‌ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నారని అన్నారు.

ఎన్టీఆర్ క్రీడా వికాసమును ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించాలా ఏర్పాటు చేసినట్లు వివరించారు.

పింఛన్ల ను రెండింతలు చేసినట్లు చెప్పారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. అవినీతి రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తున్నామని అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *