ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ,జూమ్ యాప్ ద్వారా కుట్రలు.. విజయసాయి, అయ్యన్నమధ్య రగడ !

విజయసాయి వర్సెస్ అయ్యన్న.. ఇద్దరి మధ్య ముదిరిన వార్

హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం.

ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ అంటూ విజయసాయిరెడ్డి ఫైర్. అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్.

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార-విపక్షాల మధ్య రగడ నడుస్తోంది. పేదలకు స్థలాలు ఇస్తుంటే టీడీపీ అడ్డుకుంటోందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తే.. పట్టాల పేరుతో అధికార పార్టీ నేతలు అవినీతి చేశారని ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తోంది.

ఇక ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మధ్య వార్ జరిగింది.

విజయసాయి తన ట్వీట్‌లో ‘జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ.

హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం.

ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? 2024లో నీ అడ్రస్ గల్లంతే’అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ ట్వీట్‌కు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ‘వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల అమ్మకం కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేసాడు సైకో ప్రిజనరీ.

సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్ల పట్టాలు అమ్మకం వాయిదా పడింది అనడం విడ్డురంగా ఉంది.

పట్టాలు అమ్మకం,డబుల్ రేటుకి స్థలాలు కొనడం.అధికార పార్టీ వాళ్లే చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా ప్రిజనరీ దిగజరుతూనే ఉన్నాడు’అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed