తెలంగాణ ప్రభుత్వం “2లక్షలు” …YS ‌జగన్ ‌తెలంగాణవాసులకు సైతం ఎక్స్‌గ్రేషియా “5లక్షలు” నష్టపరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

వేదాద్రి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణవాసులకు సైతం ఎక్స్‌గ్రేషియా.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని సూచించారు.

రాష్ట్ర భూభాగంలోనే ప్రమాదం జరిగినందున మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు 2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

బుధవారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది, ఏపీకి చెందిన ముగ్గురు చనిపోయారు.

మరో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

వీరంతా దైవ దర్శనం తర్వాత సొంత ఊరికి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *