అటు కేంద్రం ఇటు రాష్ట్ర పెద్దలు ఆశలు ఆవిరి చేశారoటున్న జగన్

కేంద్రం ప్రవేశపెట్టిన చివరి ఐదో బడ్జెట్లోనైనా ఏపీకి న్యాయం చేసి . ఎన్నికలకు వెళ్తారన్న ఆశలను దూరం చేశారు. ఎలాంటి ప్రకటన చేయలేదు.

కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్లలో రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా ,చప్పట్లు కొట్టిన చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీల గుణపాఠం తప్పదు.

హత్య చేసిన వ్యక్తి అదే హత్య కు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో. కేంద్ర బడ్జెట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన విమర్శలు. ఆయన చేసిన ప్రకటనలు అలాగే ఉన్నాయని జగన్ విమర్శించారు.

“ప్రత్యేక హోదా కాదని, మన కేంద్రానికి అసెంబ్లీ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయించారు.

అది తప్పని మేము ఆ రోజు నల్ల చొక్కలతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని నానా మాటలన్నారు చంద్రబాబు. ఈరోజు నల్ల చొక్కా వేసుకొని వచ్చారు” అని పేర్కొన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ గారు 4న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఓట్లను గల్లంతు చేస్తున్నారని.

వైకాపా సానుభూతిపరులు తటస్తు లక్ష్యంగా ముందుకెళ్తున్నారని. ఎన్నికల సంఘానికి ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

జగన్ తన జిల్లాల పర్యటన షెడ్యూల్ లో మార్పు చేశారు. ఈ నాలుగు కు బదులు ఆరో తారీకు నుంచి పర్యటన మొదలు పెట్టనున్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో జగన్ స్వగృహ ప్రవేశం చేయనున్నారు.

తాడేపల్లి లో ఇల్లు, పక్కనే కార్యాలయం ని నిర్మించారు. ఇంటి నిర్మాణం పూర్తవడంతో ఈ నెల 14న ఉదయం ఎనిమిది ఇరవై ఏడు గంటలకు జగన్ గృహ ప్రవేశం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *