బీసీలకు వరాలు కురిపించిన సీఎంకు కృతజ్ఞతలు

విశాఖపట్నం: సమాజంలో సగమైన బీసీల జీవితాల్ని పండుగలా మార్చే పథకాలు రూపోందించిన.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర శిక్షణా శిబిరాల డైరెక్టర్ మరియు పార్టీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఉత్తరాంధ్ర బీసీ నేతలు ప్రత్యేకంగా కలిశారు.

వెనుకబడిన కులాలు కాదు. వెన్నెముక వంటి కులాలు అనినమ్మి అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు.

అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో బుధవారం ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

బీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 15 లక్షల అందిస్తామనే ప్రకటన బీసీ వర్గాల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపిందిని సీఎంకు తెలిపారు.

బీసీ గర్జన వేదికపై చంద్రబాబు బీసీలకు కురిపించిన వరాల జల్లుల పై ప్రజల స్పందనను కలిశెట్టి అప్పలనాయుడు సీఎంకు వివరించారు.

అన్ని వర్గాల వారి అభిప్రాయాలతో పాటుగా పత్రికల్లో వచ్చిన స్పందన వివరాల్ని పొందుపరచిన నివేదికను చంద్రబాబుకి అందించారు.

రెండో విడత ఆదరణ ద్వారా కోట్ల రూపాయల విలువైన అధునాతన పనిముట్లును అందించడంపై ఆయాన కులాల వారి స్పందనను కూడా ఈ సందర్భంగా చర్చించారు.

మరోవైపు వేల కోట్ల రూపాయలు లోటులోనూ డ్వాక్రా అక్కచెల్లెల్లకు రెండో విడత పసుపు కుంకుమ పథకం ప్రకటన కూడా గొప్ప ఆనందాన్ని నింపిన విషయాన్ని బృందం సభ్యులు తెలిపారు.

ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వేలాదిగా విశాఖకు తరలి వచ్చి డ్రాక్రా సమావేశాన్ని ఘన విజయం చేసిన సంఘటన కూడా చర్చించారు.

సీఎంతో కలిసిన బృందంలో కలిశెట్టి అప్పలనాయుడు, ద్వారపురెడ్డి జగదీష్ ప్రసాద్ రావు తో పాటు మరికొంత మంది బీసీ నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *