ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్‌గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • 1.టీడీపీ ఓడిపోవడం ఖాయం
  • 2.చంద్రబాబుపై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు
  • 3.ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. పారిపోయిన పిరికిపంద చంద్రబాబు.

తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీని తీసుకెళ్లి.. కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టిన ఘనత చంద్రబాబుదే.

  • ఎన్నికల కోసమే పసుపు-కుంకమ డ్రామాలు
  • ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయం
  • కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్‌గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి.. మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీని ఎంచుకోవాలని కోరతామన్నారు.

ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. పారిపోయిన పిరికిపంద చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తలసాని. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీని తీసుకెళ్లి.. కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రెండు నెలల్లో టీడీపీ ఓటమి ఖాయమని.. చంద్రబాబుకు ఏపీలో పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమన్నారు.

చంద్రబాబు తెలంగాణలోని సెటిలర్స్‌ని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం దారుణమన్నారు మంత్రి. ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు పసుపు-కుంకమ పేరుతో డ్రామాలు మొదలు పెట్టారని.. ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

అంతకముందు సిద్ధిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెల్లి మల్లన్నను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మల్లన్న దర్శనానికి వెళ్లారు. మంత్రికిఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. తలసాని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పట్నం సమర్పించారు.

మంత్రికిఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. తలసాని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పట్నం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *