CM KCRను ఆకాశానికి ఎత్తేస్తున్నతెలుగుదేశం పార్టీ నేతలు…

కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు. మంచి నిర్ణయమంటూ కితాబు.. ఎన్టీఆర్‌పై ప్రేమను కేసీఆర్ ఇలా చాటుకున్నారా.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని టీడీపీ నేతలు స్వాగతించారు. మంచి నిర్ణయమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అంతేకాదు ఎన్టీఆర్‌పై అభిమానాన్ని కేసీఆర్ ఇలా చాటుకున్నారనే చర్చ జరుగుతోంది. అసలు విషయానికి వస్తే.. తెలంగాణలో పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చారు.

ఈ ఏడాది కొత్తగా రూపొందించిన సిలబస్‌లో పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో ఎన్టీఆర్ జీవిత విశేషాలను పొందుపరిచారు.
సాంఘిక శాస్త్రంలో బుక్‌లో ఢిల్లీ పెద్దలు చేస్తున్న పనులకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని.. అప్పటికే సినిమా రంగంలో టాప్ హీరోగా ఉన్నారని.. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చిన పథకాలను ప్రస్తావించారు. కిలో బియ్యం రూ.2లకే, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.
తెలంగాణలో అన్న గారి జీవితం పాఠ్యాంశంగా చేర్చడం ఆనందకరం అన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
తెలుగుదేశం పుట్టింది తెలంగాణ గడ్డ మీద.. అక్కడ ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థని తొలగించింది రామారావు గారు అంటూ ట్వీట్ చేశారు.