మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా లక్ష్మీస్ ఎన్టీఆర్…తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం రోజు నే లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్… చంద్రబాబు నాయుడు నిజస్వరూపం బట్టబయలు.

మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల అయ్యింది. చూస్తుంటే సినిమా పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా తీసినట్లు తెలుస్తోంది.

దానికి తోడు ఎన్టీఆర్ కుటుంబం పై కూడా నెగిటివ్ ఛాయలు వచ్చేట్లు వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సినిమాలో పూర్తిగా లక్ష్మీ అమాయకంగా, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా అని తెలుస్తోంది.

చంద్రబాబు పాత్రతో పాటు కుటుంబ సభ్యులను కూడా కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అవి చూసిన తర్వాత కచ్చితంగా మరింత చర్చ జరగడం ఖాయమని తెలుస్తోంది.

ఫస్ట్ హాఫ్ కేవలం ఎన్టీఆర్ మరియు లక్ష్మీపార్వతి మధ్య వచ్చే సన్నివేశాలు తోనే సాగిపోతుంది. ఆ తర్వాత కీలకమైన సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది.

వెన్నుపోటు ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా సాగిన క్లైమాక్స్ మాత్రం ఎన్టీఆర్ కు అన్యాయం జరిగిందని ఓవర్ డోస్ సెంటిమెంట్ చూపించారని తెలుస్తోంది.

చివర్లో ఎన్టీఆర్ నిజమైన అంత్యక్రియల విజువల్స్ వేసి మరింత సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశాడు వర్మ.

ఈ చిత్రంలో అన్ని నిజాలే ఉన్నాయని చెప్పలేమని కొన్ని మాత్రమే చూపించారు కానీ అన్ని కాదంటున్నారు విశ్లేషకులు. దీనికితోడులక్ష్మీ పార్వతిని మరీ అమాయకురాలిగా చూపించడం కూడా ఒప్పుకో తగ్గ విషయం కాదంటున్నారు విశ్లేషకులు.

ఎన్టీఆర్ కి మరో వెన్నుపోటు… AP లో మూవీ రిలీజ్ అవ్వకుండా అడ్డు

సెన్సార్ బోర్డు క్లియర్ చేసిన తరువాత సినిమాను అడ్డుకోవడానికి వీలు లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.

ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించి సాధ్యమైనంత తొందరగా ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ప్రయత్నాలు చేస్తున్నామని వర్మ తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్రప్రదేశ్లో అడ్డుకోవడం తో ఎన్టీఆర్ కు మరోసారి వెన్నుపోటు పొడిచారని చిత్ర దర్శకుడు వ్యాఖ్యానించారు సెన్సార్ బోర్డు క్లియర్ చేసిన తరువాత సినిమాను అడ్డుకోవడానికి వీలు లేదని సుప్రీం కోర్టు తీర్పు ఉందని అన్నారు.

ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించి సాధ్యమైనంత తొందరగా ఏపీలో సినిమా రిలీజ్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా రిలీజ్ అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎవరో అందరికీ తెలుసు అంటూ పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

సినిమాకు వస్తున్న స్పందనను బట్టి ఈ సినిమా చూడాలనే ఆసక్తి ప్రజల్లో ఎంతగా ఉందో అర్థం అవుతోందని అన్నారు. ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ నిజం కాదని చెప్పడానికి సరైనది కాదు అని వర్మ అన్నారు. వీడియో ఆధారాలు లేని ఏది నిజం కాదని ఆయన అన్నారు.

అప్పుడు ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియదని నిజమే నిజం అనేది చూసే వారికి నమ్మేలా ఉండాలి అనేది తన భావన అని స్పష్టం చేశారు.

పరిశోధన చేసి సేకరించిన సమాచారాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కించానని చెప్పారు.

ఎన్టీఆర్ మానసిక క్షోభకు గురి చేసి చంపేసాడు అని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం రోజు నే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో లో రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని మొత్తం తెరకెక్కించారు అని పబ్లిక్ టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *