టీడీపీ V/S వైసిపి… సక్సెస్ ఎవరిదో…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వరసగా నేతలు టిడిపి నుంచి జంప్ అవుతున్నారు. ఇప్పటివరకు ఈ రూట్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వలస వచ్చారు. మరికొందరు నేతలు కూడా జంపు జిలాని కి సిద్దమవుతున్నారు. దీనికి సంబంధించి సక్సెస్ ఎవరిని వరిస్తుందో అనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.

ప్రత్యేకంగా కోస్తాంధ్ర నుంచి తదుపరి చేరికలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరడం ముందుగా మనకు తెలిసిన విషయం. మోదుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం లాంఛనమే అని టాక్. అలాంటిది ఏమీ లేవంటూ మీడియాలో వినిపిస్తున్న ఈ పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది.

వై వి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీ సీట్లు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. మాగుంట వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారట.వై వి సుబ్బారెడ్డి కి జగన్ పార్టీ బాధ్యతలను అప్పగిస్తారని… మాగుంట చేరితే టికెట్ ఆయనకే అని భావిస్తున్నారు. ఈ పంచాయతీని జగన్ ఏం తేలుస్తారు చూడాల్సి ఉంటుంది. మాగుంట వైసీపీ లోకి చేరడానికి…

ఒంగోలు ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులుగా ఎవరైతే బాగుంటుంది అని జాబితాను కూడా రెడీ చేయాలనుకుంటున్నా వైయస్సార్ పార్టీ… మంత్రి వర్గ విస్తరణపై హరీష్ రావు స్పందన…

ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజుల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రివర్గ విస్తరణ చేయాలని అనుకున్నారేమో. ఈ విషయంపై గవర్నర్ ను కలిసి డేట్ అండ్ టైం ఫిక్స్ చేసారు. ఏ పనిలో అయినా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే కేసిఆర్ ఈ పనికి కూడా… జన్మ నక్షత్రం తో సరిపోల్చి పౌర్ణమి తో కూడిన ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.

ఈ విషయం వినగానే అందరి చూపు ఒకేసారి హరీష్ రావు మీద పడింది. కేసిఆర్ స్వయాన మేనల్లుడైన హరీష్ రావు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ హరీష్ రావు సరైన ప్రాధాన్యం దక్కలేదు. గతంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావుకు ఈసారి క్యాబినెట్ లో చోటు దక్కుతుందా లేదా అని అనుమానం అందరిలో ఉంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

హరీష్ రావుకు, కెసిఆర్ కు పడటం లేదు అన్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన కొడుకుని నియమించడం పట్ల హరీష్ రావు అలకపానుపు ఎక్కినట్టు సమాచారం. దీనికితోడు గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో, అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయడం ఊహాగానాలకు మరింత చోటు నిచ్చింది. ఈ మేరకు మంత్రివర్గంలో హరీష్ కు చోటు దక్కుతుందో లేదో అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ కావాలని హరీష్ ను పక్కన పెడుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో హరీష్ తో పాటు తను కూడా ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారుట.. అందుకే హరీష్ ను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పి ఇస్తున్నారంటూ సమాచారం..

హరీష్ తో పాటు కేటీఆర్ మంత్రి పదవి పై కూడా చిన్నపాటి సస్పెన్స్ కొనసాగుతోంది. కేటీఆర్ ను పార్టీ బాధ్యతలకే పరిమితం చేస్తారా… లేదా మంత్రి పదవి కూడా ఇస్తారా.. అనేది ఇంకా తేలాల్సిన విషయం.19వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ సస్పెన్స్ వీడనుంది…

రాజ్యాంగం ప్రకారం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రులతో కలుపుకొని 18 మంది సభ్యులకు చోటు ఉంది. ముఖ్యమంత్రి, హోం మంత్రిని మినహాయిస్తే… మరో 16 మందికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వగలరు. మంగళవారం నాడు జరిగే మంత్రివర్గ విస్తీర్ణంలో పదిమందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత మిగతా పదవులను భర్తీ చేసే అవకాశం ఉందని తెలిపారు… ఒకే మాట ఒకే బాణం గా వ్యవహరిస్తున్న జగన్ ….విలువలు విశ్వసనీయతకు కట్టుబడి…. రాజకీయరంగంలో ఒకే మాట మీద నిలబడటం అనేది సామాన్యమైన విషయం కాదు.

కానీ, వీలైనంత వరకు ఇచ్చిన మాట మీద నిలబడడానికి ప్రయత్నిస్తే కనుక , ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. పూటకో మాట మార్చే నేతలు ఉన్నా ఈ రోజుల్లో…. విలువలు విశ్వసనీయతకు కట్టుబడి ఉండడం ఆషామాషీ ఆయన విషయం ఏమీ కాదు… అలా కట్టుబడిగా ఉన్న వాళ్లకి గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విషయంలో పరిస్థితులకు తగ్గట్టుగా విభజన – సమైక్య అంశంపై మాట మార్చుకోవాల్సిన సందర్భాన్ని మినహాయిస్తే, ఎక్కడా ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ మాట మార్చిన దాఖలాలు లేవు… విలువలను విడ తీసింది లేదు… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి వేరు… పూటకో మాట గా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో బాబు మాట మార్చిన సందర్భాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఎవరు అధికారంలోకి వస్తారు అనేది ఓటర్లు కదా డిసైడ్ చేసే ది. నేతలు అటు నుంచి ఇటు జంపింగ్ చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో చేరుతున్న నేతలు చెబుతున్నది ఒక్కటే, అదే,’జగన్ ఎల్లప్పుడు ఒకే మాట మీద నిలబడతారు అని, ఇచ్చిన మాట తప్పారు అని…’ప్రత్యేక హోదా విషయంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ జగన్ మాత్రం మాట తప్పలేదు. ప్రత్యేక హోదా అంశంలో ఇప్పటికీ సజీవంగా ఉందంటే అది జగన్ గారి పుణ్యమేనని చెప్తున్నారు.

వైఎస్సార్సీపీలోకి చేరుతున్న నేతలంతా తమ పదవులకు రాజీనామా చేసి వస్తున్న వారే… ఇప్పుడంటే ఎన్నికల ముందు అనుకోవచ్చు… కానీ, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైయస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భవిష్యత్తులోనూ వైయస్ జగన్ ఇదే మాట మీద నిలబడతారని పార్టీలు మారే నేతలు కచ్చితంగా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని సిద్ధాంతం పెట్టుకున్నామని వైఎస్ఆర్సిపి అంటుంది.

ఈరోజు దాసరి జై రమేష్, వైయస్ జగన్ తో భేటీ అయ్యారు‌.. వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబుతో పొసగక చాలాకాలంగా టిడిపికి దూరంలో ఉన్నారు దాసరి జై రమేష్, టిడిపి ఇప్పుడు ఓ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైంది,, అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు… వైయస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు ఆయన..

వైఎస్ఆర్ సీపీ నేతలు భావిస్తున్న దాన్నిబట్టి రానున్న రోజుల్లో దాదాపు ఆరుగురు ఎంపీలు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీ కి వీడ్కోలు పలికి వైఎస్ జగన్ తో చేతులు జోడించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *