ఏపీలో టీడీపీ వర్సెస్ బీజేపీ… మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు…

ఏపీ పర్యటనకు మోదీని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ. మోదీ గో బ్యాక్ అంటూ గన్నవరం విమానాశ్రయం నుంచి జాతీయ రహదారిపై భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు.

ముఖ్యాంశాలు:
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ రాక పై నిరసనలు వ్యక్తం చేస్తున్న టిడిపి, బిజెపి నేతలు. పలు నేతల విమర్శలతో రాజకీయ సెగ పెరిగింది.

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.రేపు గుంటూరు జిల్లాకు రానున్న మోదీని అడ్డుకునేందుకు అధికార టిడిపి సహా వామపక్షాలు, ప్రజా సంఘాలు సిద్ధం అయ్యాయి.

గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారిపై’మోదీ గో బ్యాక్’అంటూ భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. రాష్ట్రాన్ని పట్టించుకోని మోదీకి రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు ఏ మాత్రం అర్హత లేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ హోర్డింగ్లను చాలా చోట్ల పోలీసులు తొలగిస్తున్నారు.

టిడిపితో అన్ని సంబంధాలు పెంచుకున్నారు తొలిసారి ఏపీ పర్యటనకు వస్తున్న మోదీని ఎలాగైనా అడ్డుకోవాలని టిడిపి, ప్రజా సంఘాల నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ సహా విభజన హామీలు ఏవి నెరవేర్చని మోదీ తెలుగువాడి సత్తా ఏంటో చూపిస్తామని నేతలు అంటున్నారు.

గుంటూరు లో జరిగే ప్రజా చైతన్య సభ ఎట్టి పరిస్థితిలోనూ జరగకుండా చూడాలని నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో మోదికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మోదీ భాస్కర్ చేస్తే తమ అవినీతి ఎక్కడ బయట పడుతుందని చంద్రబాబు ఆందోళన పడుతున్నారు అని అంటున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మోదీ పర్యటన దిగ్విజయంగా జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు సాగనివ్వబోమని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా గత ఏడాది నుంచి ఉప్పు నిప్పులా మారిన టిడిపి బిజెపి నేతల మధ్య మోదీ పర్యటన మరింత రాజేస్తోందనే చెప్పవచ్చు.

మోదీ సభకు జనాన్ని సమీకరించే బాధ్యతలను ప్రతిపక్ష వైసిపి తీసుకుందంటూ టిడిపి నేతలు విమర్శలు చేస్తూ ఉండటం రాజకీయంగా మరింత వేడిని రజేస్తోంది.

#GoBackModi “Andhra is unwelcoming you Mr prime minister…” says TDP & Babu fans

  • Posters against PM Modi’s Andhra visit have come up on social media
  • On Saturday, Andhra CM Chandrabbabu Naidu said Modi’s visit will be a ‘dark day’
  • Modi will address a public gathering in Guntur today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *