రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అంకితం శ్రీకాకుళంలో జన్మభూమి సభలో చంద్రబాబు

రాష్ట్రంలో నిరంతరం అభివృద్ధికి బాటలు వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లాల్లోని రాజాం మండలం పోగిరిలో నిర్వహించిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పోగిరి గ్రామస్తులతో సీఎం చంద్రబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టామని వాటి ఫలితాలను కూడా అధిశాతం ప్రజలు పొందుతున్నారని తెలిపారు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ప్రగతి మార్గాన నడిపించేందుకు తాను చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఈ కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ మంత్రి పి అశోక్, గజపతిరాజు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

సొంతింటి కల నెరవేరుస్తాం

ఇదిలా ఉండగా, సొంతిల్లు లేని ప్రతి ఉద్యోగికి గృహ వసతి కల్పించి వారి సొంతింటి కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల ద్వారా ప్రజా సేవచేసే ప్రతి ఉద్యోగి సొంత ఇల్లు ఉండాలని ఆయన తేల్చిచెప్పారు. ఉద్యోగులు ఇల్లు నిర్మాణానికి భూములు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అపార్ట్మెంట్లు నిర్మించి అందులో వారికి ప్లాట్లు కేటాయించాలని సూచించారు. జన్మభూమి కార్యక్రమం పై కలెక్టర్లు , నోడల్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రగతికి ప్రజలు ఉద్యోగులే రథాలు అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఇరువర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేకం చేస్తామని గుర్తు చేశారు. 30, 40 ఏళ్లు హైదరాబాదులో అనుబంధం వదులుకొని ఉద్యోగులు, న్యాయవాదులు ఇక్కడికి వచ్చినందున వారు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ జన్మభూమిలో ఫిర్యాదులు సంఖ్య సగం వరకు తగ్గిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యం రెట్టింపు అయిందని చెప్పారు ప్రజల్లో సంతృప్తి ఇందుకు కారణంగా అభివర్ణించారు.

రేషన్ ఫ్యాషన్ ఇల్లు కోసం వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. చుక్కల భూమి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని పునరుధ్ఘాటించారు. ఏళ్లుగా రైతును సతమతం చేస్తున్న ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలని తేల్చిచెప్పారు భూమిని బదిలీ చేసుకోలేక అమ్ముకోలేక అనేకమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వమే సమోటాగా చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూడాలని సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *