మాజీ మంత్రి నారా లోకేశ్‌కు జగన్ సర్కారు షాకిచ్చింది…

TDPకి షాాకిచ్చిన జగన్ సర్కారు.. లోకేశ్ భద్రత కుదింపు, 8 నెలల్లో..
టీడీపీ నేత నారా లోకేశ్‌కు జగన్ సర్కారు షాకిచ్చింది. ఆయన భద్రతను కుదించింది. లోకేశ్ భద్రతను కుదించడం 8 నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

టీడీపీ నేతకు వై ప్లస్ భద్రత కల్పిస్తుండగా.. దాన్ని ఎక్స్ కేటగిరీకి తగ్గించారు. లోకేశ్ భద్రత తగ్గించడం గత 8 నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

గతంలో లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించేవారు. తర్వాత దాన్ని వై కేటగిరికి, ఇప్పుడు ఎక్స్ కేటగిరీకి మార్చారు.

అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా ఆందోళనలు చేయడంతోపాటు.. శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా లోకేశ్ వ్యవహరిస్తున్నారు.

ఇటీవలే సాక్షి పత్రికపై లోకేశ్ రూ.75 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఈ తరుణంలో ఆయన భద్రత కుదించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మావోయిస్టుల నుంచి ముప్పు ఉందనే నిఘా సంస్థల నివేదికలతో నారా లోకేశ్ కి 2014కు ముందే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2+2 భద్రత కల్పించింది.

టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. లోకేశ్ భద్రతను 4+4కి పెంచారు.

2016లో ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని.. లోకేశ్ లక్ష్యంగా దాడులు చేస్తామని మావోయిస్టులు ప్రకటించారు.

దీంతో ప్రభుత్వం లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. జూన్ 25 నుంచి రెండుసార్లు లోకేశ్ భద్రత తగ్గింపు పట్ల టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *