కొత్త డ్రామా తో ప్రజల ముందుకు మళ్లీ చంద్రబాబు… ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామా

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.

చంద్రబాబు చెబుతున్న కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత అనేది పచ్చి అబద్ధమని అన్నారు.

ఈ నేపథ్యంలో కాపులను మళ్లీ మోసం చేసేందుకే రిజర్వేషన్ అంశాన్ని తెచ్చారని ఆరోపించారు.

పసుపు కుంకుమ పేరుతో మరోసారి డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు ఆరోపించారు.

డ్వాక్రా మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

నోటిఫికేషన్ ఇచ్చాక ఇదే పరిస్థితి ఉండదు. అటువంటప్పుడు పోస్టులు ఏం లాభం అని ప్రశ్నించారు.

గత ఎన్నికలలో రుణమాఫీ తో మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు పసుపు కుంకుమ సిద్దపడ్డారని విమర్శించారు.

డ్వాక్రా మహిళలకు వైయస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైయస్ జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు.

ప్యాకేజీ ఇచ్చాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అరుణ్ జైట్లీ ని సన్మానం చేసిన చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్షం పేరుతో ఏపీ ప్రత్యేక హోదా కి హడావిడి చేస్తున్నాడని అన్నారు .

ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ అద్భుతమని చంద్రబాబు అప్పట్లో అన్నది గుర్తు చేశారు.

వైయస్సార్ హోదా కోసం బందులు చేస్తే వైఎస్సార్ సీపీ నేతల ను జైల్లో పెట్టించిన విషయాన్ని ప్రజలు మర్చిపోరు అన్నారు.

ప్రత్యేక హోదా అంటేనే జైల్లో పెడతాం అని బెదిరించిన చంద్రబాబు, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటే ప్రజలే నమ్మడానికి అమాయకులు కాదు అన్నారు.

ఉండవల్లి కి తాము వ్యతిరేకం కాదు అని ఆంధ్రుల ను మోసం చేసిన జనసేన టీడీపీ నేతల మధ్య కూర్చోవడం ఇష్టం లేకనే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదని అన్నారు.

రేపు జరగబోయే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *