హామీలు మరచి దౌర్జన్యం కు దిగుతున్న టిడిపి

Kamma brothers suspects other caste voters

Kamma brothers suspects other caste voters

పేదవాడికి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చే సమయంలో చంద్రబాబు దగ్గర నుంచి ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు దురహంకార పూరితమైన దౌర్జన్యాలు చేస్తూ పేద ప్రజలను అవమానిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టిజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లు అమలు చేయడం మరచిపోయి. అధికార దర్పంతో దౌర్జన్యాలకు పాల్పడడం శోచనీయమన్నారు.

ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టిడిపి నేతలకు హితవు పలికారు.

డ్వాక్రా రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తానని, టిడిపి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు.

విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో సుధాకర్ బాబు సోమవారం విలేకరులతో మాట్లాడారు.

ప్రజలకు తమ సొంత సొమ్ములు ఇస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని. 10.వేలువిషయంలో స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు.

పెట్టుబడి నిధి కింద ఇస్తున్నారా ,పసుపు కుంకుమ కింద ఇస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవోలు పెట్టుబడి నిధి కింద చూపిస్తోందన్నారు.

మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కు ఇచ్చి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే చంద్రబాబు ఇచ్చే చెక్కు చెల్లుతుందా. అని ప్రశ్నించారు. ప్రజలకు ఇస్తున్న సొమ్ము నారావారి పల్లె నుంచి తెచ్చింది కాదన్నారు.

ప్రజలు కట్టే పన్నులు అన్నారు. చంద్రబాబు దుష్ట పరిపాలన సాగిస్తున్నారని. టిడిపి ప్రభుత్వం దోపిడి పరిపాలన మరో 60 రోజుల్లో అంతం అవుతుందన్నారు.

చింతమనేని ప్రభాకర్ వంటి వీధి రౌడి ని చంద్రబాబు విప్ గపెటుకున్నారని ధ్వజమెత్తారు. పదే పదే ప్రభుత్వ అధికారులపై దాడి చేసి ప్రజాస్వామ్య విలువలను గంగ లో తొక్కారు.

చింతమనేని ఆదివారం జరిగిన కార్యక్రమంలో వృద్ధుని తిట్టడం దారుణం అన్నారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు మహిళా కుటుంబ సభ్యులతో మాట్లాడిన తీరు దారుణంగా ఉందన్నారు.

నిన్న మంత్రి పరిటాల సునీత పై చెప్పులు ఎందుకు పడ్డాయో చంద్రబాబునాయుడు గ్రహించాలన్నారు. పేదల పట్ల టీడీపీ మంత్రులు చులకన భావంతో మాట్లాడుతున్నారని. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed