ఆంధ్రాలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నవాళ్ళు – 50 లక్షలు+

 • పెన్షన్స్ తీస్కుంటన్నవాళ్ళు – 51 లక్షలు
 • అన్న కాంటీన్స్ ద్వారా లబ్ధిదారులు – 1.5 క్రోర్స్
 • ఒకేవిడతలో రైతు రుణమాఫీ పొందినవారు(50 వేలు కంటే తక్కువ ఉన్నవారు) – 24 లక్షల మంది.
 • విడతలు వారీగా రుణమాఫీ పొందినవారు – 36 లక్షల మంది.
 • బడికొస్తా పధకం ద్వారా ప్రతి సంవత్సరం సైకిల్ పొందుతున్నవారు – 2 లక్షలు
 • ఇప్పటి వరకు నిర్మించిన కొత్త ఇళ్ళు – 7 లక్షలు
 • జనవరి కి పూర్తయ్యేవి – 3 లక్షలు
 • ఆమోదం పొందిన కొత్త ఇళ్ళు – 9 లక్షలు
 • ఎన్టీఆర్ వైద్యసేవ లబ్ధిదారులు – 22 లక్షలు
 • రుణాలు తీస్కొన్న తోపుడు బండ్లు వాళ్ళు – 1.75 లక్షలు
 • గ్రూప్ 1 రెండు సార్లు ,గ్రూప్ 2 ఒక్కసారి ,గ్రూప్ 4 ఒక్కసారి , DSC రెండు సార్లు,ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు అన్ని కలిపి 30 వేలు దాటాయి.పక్క రాష్ట్రం తెలంగాణతో పోల్చిచూస్తే ఏపీ ఎంత బెటర్ అనేది మీకు అర్ధం అవుతుంది.
 • నిరుద్యోగ భృతి పొందుతున్నవారు – 6 లక్షలు ( టార్గెట్ పది లక్షలు)
 • పట్టిసీమ,ఏలేరు ,జీడిపల్లి ,గండికోట ,సిద్దాపురం ఎత్తిపోతల ,తోటపల్లి పూర్తయ్యాయి. లాభం పొందిన రైతులు లక్షల్లో ఉన్నారు.
 • పోలవరం , అమరావతి నిర్మాణం సేరవేగంగా జరుగుతుంది.ఇవి పూర్తి కావాలంటే బాబు అయితేనే సాధ్యం అని ప్రతి తటస్థ ఓటర్ కూడా విశ్వసిస్తున్నాడు.
 • మోడీ సహాయం చేయలేదని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు, మోడీని గట్టిగ ఢీ కొట్టడంతో టీడీపీ కీ దూరమైనా కొన్ని వర్గాలు దగ్గరయ్యాయి.
 • రాయలసీమకు కనివినెరుగని రీతిలో పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయి, 150 +TMC ల నీళ్లు ఇవ్వడం జరిగింది.
 • గ్రామాల రూపురేఖలు మార్చేశారు..అన్ని వీధులు సిమెంట్ రోడ్స్ ,లెడ్ బుల్బ్స్ తో ఆహ్లాదంగా ఉన్నాయి.
 • ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందింది, బస్సు స్టాండ్ల రూపురేఖలు మార్చేశారు ..3 తుపాన్లు వచ్చిన సరైన చర్యలు సత్వరమే తీసుకున్నారు.
 • ప్రతి ఒక్కరికి పండక్కి సంక్రాంతి,క్రిస్మస్ ,రంజాన్ కానుకలు ఇస్తున్నారు.
 • 88 లక్షల మహిళలకి 8800 కోట్లు 10% వడ్డీతో కలిపి రుణమాఫీ చేసారు.
 • కేంద్ర ప్రభుత్వ సాకారంతో రాజమండ్రి,విజయవాడ ,రేణిగుంట ,కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసుకున్నాం.
 • గత నాలుగు సంవత్సరాల్లో దేశంలో గ్రీనరీ ఎక్కువ పెంచిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది..పరిశభ్రమైన నగరాల్లో టాప్ పదిలో మూడు ఏపీలోనే ఉన్నాయి..దేశంలోని టాప్ 100 బెస్ట్ పంచాయితీల్లో 36 ఆంధ్రా నుండే ఉన్నాయి. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఏపీ నెంబర్ 1.
 • అన్ని కులాలకు కార్పొరేషన్ పెట్టి రుణాలు ఇచ్చి,పిల్లలను విదేశాల్లో చదివించడం,ఐఏఎస్ ఎక్సమ్ కోచింగ్ ఇప్పించడం చేస్తున్నారు .
 • ఆదరణ కింద చేతి వృత్తులకు,కుల వృత్తులకు యంత్ర పరికరాలు ఇవ్వడం జరిగింది.
 • చంద్రన్నభీమా 2 లక్షల కుటుంబాలని ఆదుకుంది.. ఎన్టీఆర్ వైద్యసేవ 2.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తుంది.
 • అంగన్వాడీ,వీ ఆర్ వో, హోమ్ గార్డ్స్ జీతాలు రెండు రెట్లు పెంచారు. ప్రవిత్వ ఉద్యోగస్తులకు, ఆర్టీసీ వాళ్ళకీ 43% ఫిట్మెంట్ పెంచారు .
 • రాష్ట్రంలో వైసీపీ,జనసేన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మోడీని ప్రశ్నించలేదు.జగన్ సీఎం అయితే అన్ని చేస్తా అంటున్నాడు,అసలు ఎం మాట్లాడతాడో కూడా జనానికి అర్ధం కావడం లేదు.
 • ఎక్కువ మంది చెబుతున్న మాట ఎంత అనుభవం ఉన్నాయన్నే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు.పాలన ఎటువంటి అనుభవంలేని వాళ్ళు వస్తే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అని..ఆ ఆలోచన జనంలో ఉంది.
 • ఫార్మ్హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రినే గెలిపించినపుడు కష్టపడే ముఖ్యమంత్రిని ఎందుకు గెలిపించరు..లోటు బడ్జెట్లో కూడా మనకు ఏ లోటు లేకుండా చూసి అనుక్షణం మనకోసం కష్టపడే వాడిని ఒక్కసారి కోల్పోతే ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న రాష్ట్రం మళ్ళీ వెనక్కి పోతోంది.

1 thought on “ఆంధ్రాలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నవాళ్ళు – 50 లక్షలు+

 1. ** చావో……రేవో……తేల్చుకుందాం!! **

  బాధగా వుంది సార్…….నేనొక్కడినే కాదు నాలానే బాధపడిన చాలామంది మీలోకూడా ఉండి వుంటారు…….మొన్నటిదాకా నాయుడుగారు తెలంగాణలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ విజయం ఖాయం అన్న పేపర్లు, టీవీ ఛానళ్ళు ఎలక్షన్ ఫలితాలు రాగానే నాయుడుగారి వల్లనే కాంగ్రెస్ ఓడిందంటున్నారు……కానీ ఓడింది నాయుడిగారివల్ల కాదు సార్……

  నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓట్లసంఖ్య కంటే పెద్ద మొత్తం లో ఓట్లు పోలయ్యాయంటే ఇది దేనికి సంకేతం?…..
  22 లక్షలమంది ఓట్లు తొలగించినా ఇలా ఎందుకుచేశారు అని అడగకుండా మనకేంపట్టనట్లు ఎవరిపనుల్లో వారు మునిగిపోయారు……ఓటు వున్నా కూడా వినియోగించుకోకుండా మరో తొమ్మిదిన్నర లక్షలమంది ఆంధ్రలో ఉన్న స్వస్థలాలకు బస్సులు, రైళ్లు, కార్లు చివరికి విమానాలు కూడా పట్టుకొని ….రెక్కలుకట్టుకొని ఎగురుకుంటూ వచ్చేశారు…….ఇక్కడికొచ్చి కె.సి.ఆర్ ఓడిపోతాడు అని ఉత్తరకుమారుడి ప్రగల్బాలు పలికారు……..
  మోడీ పుణ్యమా అని పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరతోపాటు ఓటు విలువ కూడా పెరిగింది…….ఒక్కో ఓటు వెయ్యి రూపాయల నుంచి అమాంతం రెండువేలకి పెరిగింది…..
  పోలింగ్ సమయం ముగిసిన తరువాతకూడా కనీసం ఒక్కో నియోజకవర్గానికి 10 శాతం చొప్పున ఓట్లు పోలయినట్లు సమాచారం……
  ఒక్కో నియోజకవర్గానికి సగటున 61 కోట్ల చొప్పున ధనరూపేణా, మద్యం, మాంసం, చీరలు……ఇలా రకరకాల రూపంలో పంపిణీ జరిగిందని తేలిన లెక్క…….

  కానీ ఎవరూ నోరుతెరిచి అడగలేదు…….ఇప్పటికే బ్రష్టుపట్టిన ఆర్థిక, ప్రణాళిక, న్యాయ, రక్షణ,సంక్షేమ వ్యవస్థలతోపాటు ఇప్పుడు కొత్తగా ఎన్నికలవ్యవస్థకూడా నాశనం చేశారు……. ఫలితంగా ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైంది…….మొత్తానికి గెలిచేశాడు…… ప్రజాస్వామ్యాన్ని “గేలిచేసి” గెలిచాడు……. ఇప్పుడు షరామామూలుగానే మళ్ళీ నోటికి పని చెప్పాడు…….. నాయుడుగారు తెలంగాణలో ప్రచారం చేసినందుకు ఆయన విజయవాడ నడిబొడ్డున నాయుడుగారి గురించి చెప్తాడంట…… ఏం చెప్తాడు?…….పదిహేనేళ్లక్రితం నాయుడుగారు నాటిన చెట్టు ఇప్పుడు కాయలు కాస్తుంటే ఆయన కోసుకుని తింటున్నా అని చెప్తాడేమో……నాయుడుగారు తెలంగాణ లో ఎలక్షన్ కోసం ప్రచారం చేశారు అంటే తాను నాయకత్వం వహిస్తున్న పార్టీ తెలంగాణాలో వుంది…….దాన్ని, ఇన్నేళ్ళుగా జెండా మోస్తున్న కార్యకర్తలని కాపాడుకోవడం ఆయన బాధ్యత…అందుకని ప్రచారం చేశాడు…..మరి ఆయన ఆంధ్ర వచ్చి ఎవరి జెండా పట్టుకుంటాడో చూద్దాం…….. దేశంలో ఎక్కడా లేనటువంటి కులాల కుళ్ళు రాజకీయం రాజ్యమేలుతున్న ఆంధ్రరాష్ట్రంలో జనసేన, వై.సి.పి రెండింటిని కలిపి ఆయనకి మాత్రమే సాధ్యమయిన తెరవెనుక కుట్రలు చేసి నాయుడుగారిని పదవీచ్యుతుడ్ని చెయ్యడానికి వేలకోట్లు డబ్బు తెలంగాణ నుంచి తరలిస్తాడు……ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వస్తాడంట…….రా…సాదరంగా ఆహ్వానిస్తాం….. తిరుపతికి తీసుకుపొయ్యి వెంకన్న దర్శనం చేపించి…..ప్రసాదం పెట్టించి…..న్యూ ఇయర్ క్యాలెండర్ కూడా కొనిపెట్టి……అక్కడినుంచి కియా కార్ల కంపెనీ చూపించి ఒక కార్ నీకు గిఫ్ట్ గా ఇప్పిస్తాం లే…..దర్జాగా హైదరాబాద్ లో తిప్పుకుందువుగాని……..అబ్బా, కొడుకు కలిసి ఆంధ్రలో రాజకీయసమీకరణలు మారుస్తారంట……మరి మనమెందుకున్నాం ఇక్కడ? ……..మనం చెయ్యాల్సిందేంటి?……మనకి కావాల్సిందేంటి? అమరావతి కావాలా? అవినీతి కావాలా?……..అభివృద్ధికి పట్టం కడదామా? …….అవినీతిని అందలమెక్కిద్దామా? నిర్ణయం మనచేతుల్లోనే ఉంది సార్…….అందరూ అంటున్నారు ఈసారి నాయుడుగారు గెలవకపోతే ఇంక ఆయనకి కస్టాలు మొదలయినట్లే అని…….చాలా విచిత్రంగా ఉంది సార్ వింటుంటే…….ఎవరికి కష్టాలు మొదలవుతాయో నిజంగా ఒక్కసారి ఆలోచించండి……. నాలానే మీరు కూడా ఆలోచిస్తుంటే…..రండి…చెయ్యి కలపండి……ఇప్పుడు మన ముందున్న లక్ష్యాలలో మొదటిది ….వచ్చే ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్రంలో E .V .M లు కాకుండా బ్యాలెట్ పేపర్లమీదే పోలింగ్ కి అనుమతి ఇవ్వాలని దిక్కులుపిక్కటిల్లేలా …….సోషల్ మీడియా దుమ్ము రేగిపోయేలా……ప్రచారం చేద్దాం…….మీకు తెలిసిన ప్రతిఒక్కరికి ఇది చేరేలా షేర్ చెయ్యండి…….మీలో నాకంటే చాలామంది పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు కూడా వున్నారు….మీ సలహాలు పంచుకోండి సార్…….అదే రేపటి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాది కావచ్చు……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *