జగన్ పై అటాక్ టీడీపీ ముఖ్యనేతకు ఎన్ఐఏ పిలుపు?

national investigation agency govt of India
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ కు కీలకమైన సమాచారం లభ్యమైందనే మాట వినిపిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఏకంగా సుదీర్ఘంగా ముప్పై గంటల పాటు శ్రీనివాసరావును అధికారులు విచారించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాసరావు అలాంటి ఆకు రౌడీ చేత అసలు విషయాన్ని కక్కించడం ఎన్ఐఏ అధికారులకు పెద్ద కథ ఏమీ కాదు.
ఇప్పటికే అతడి విచారణ పూర్తి చేసిన అధికారులు.. ప్రత్యక్ష సాక్షుల విచారణను కూడా చేపట్టారు. ఈ కేసులో తదుపరి ఎవరిని విచారిస్తారనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. అందుకు సంబంధించి కూడా ఇప్పుడు సమాచారం అందుతోంది. దాని ప్రకారం..తెలుగుదేశం ముఖ్యనేత ఒకరిని ఎన్ఐఏ విచారణకు పిలవనుందని వార్తలు వస్తున్నాయి.
జగన్ పై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. కానీ కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లాకా మాత్రం టీడీపీ నేతల తీరు మారిపోయింది. ఎన్ఐఏ విచారణ పట్ల వారు అభ్యంతరాలు తెలుపుతూనే ఉన్నారు.
అసలు టీడీపీ నేతలు ఈ కేసు విచారణ విషయంలో ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అనే ప్రశ్నలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ పరిణామాల మధ్యన టీడీపీ ముఖ్యనేత ఒకరికి ఎన్ఐఏ నుంచి పిలుపు రావొచ్చుననే ప్రచారం ఒకింత సంచలనంగానే మారింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నాడనే మాట కూడా వినిపిస్తోంది. దావోస్ కు వెళ్లాలని బాబు అనుకున్నాడు. అన్ని ఏర్పాట్లూ జరిగాయి. అయితే ఎన్ఐఏ విచారణ నేపథ్యంలో బాబు ఇక్కడే ఆగిపోయి.. వ్యవహారాలను సమీక్షిస్తున్నాడనే టాక్ నడుస్తోంది.