జగన్‌కు బాబు సెంటిమెంట్ డైలాగ్…ఏసుపై నమ్మకం ఉంటే అసత్యాలు చెప్పొద్దు….

‘ప్రభుత్వం అంటే ఓ నమ్మకం.. అసత్యాలు చెప్పొద్దు. .అసెంబ్లీలో అమరావతిని మార్చొద్దని చేతులెత్తి వేడుకున్నా.. సీఎం జగన్ మాత్రం వెకిలినవ్వు నవ్వారు’ అమరావతి పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యలు.
మూడు రాజధానులు పెట్టుకోమని కేంద్రం ఎక్కడా చెప్పలేదంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
రాజధానిని నిర్ణయించడానికి.. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని కేంద్రం చెప్పింది.. రాజధానిని మార్చడానికి హక్కు ఉంటుందనలేదని చెప్పుకొచ్చారు.
బుధవారం అమరావతిలో పర్యటించిన చంద్రబాబు.. రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపారు. వారి ఆందోళనలు 50 రోజులకు చేరడంతో సంఘీభావాన్ని ప్రకటించారు.
సీఎం జగన్‌కు ఏసు ప్రభువుపై నమ్మకం ఉంటే.. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానని చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
రాజధాని తరలిస్తారనే ఆవేదనతో అమరావతి ప్రాంతంలో 39 మంది రైతులు చనిపోయారని.. ప్రభుత్వం, సీఎం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ తప్పని చెబుతున్న నేతలు.. విశాఖలో పేదల అసైన్డ్ భూములు కొట్టేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి కోసం భూములు ఇవ్వని రైతుల్ని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లి సంఘీభావం తెలుపుతున్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
ప్రభుత్వం అంటే ఓ నమ్మకం.. అసత్యాలు చెప్పొద్దన్నారు. రాజధానికి వరదలు వస్తాయని తప్పుడు ప్రచారం చేశారని.. అమరావతిని శ్మశానం అన్నారని.. మరి శ్మశానంలో కూర్చొని పాలించారా అంటూ ప్రశ్నించారు.
అసెంబ్లీలో అమరావతిని మార్చొద్దని చేతులెత్తి వేడుకున్నా.. సీఎం జగన్ మాత్రం వెకిలినవ్వు నవ్వారు అంటూ బాబు మండిపడ్డారు.
రాజధానికి డబ్బుల్లేవని చెబుతున్నారని.. తప్పు చేస్తున్నామని తెలిసినా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఏమీ మాట్లాడలేకపోతున్నారన్నారు. ఇకనైనా జగన్ తన పద్దతి మార్చుకోవాలని.. లేకపోతే ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారన్నారు.